iDreamPost

ధోని, కోహ్లీలే దిగ్గజాలా? వారి గురించే మాట్లాడాలా? అతడూ ఓ లెజెండే: హర్భజన్ సింగ్

ఎప్పుడూ ధోని, విరాట్ కోహ్లీల గురించే మాట్లాడాలా? ఆ ప్లేయర్ కూడా ఓ లెజెండే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.

ఎప్పుడూ ధోని, విరాట్ కోహ్లీల గురించే మాట్లాడాలా? ఆ ప్లేయర్ కూడా ఓ లెజెండే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.

ధోని, కోహ్లీలే దిగ్గజాలా? వారి గురించే మాట్లాడాలా? అతడూ ఓ లెజెండే: హర్భజన్ సింగ్

మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఎంతటి లెజెండరీ ప్లేయర్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వారి అద్భుత ప్రదర్శన గురించి ఎవరో ఒక దిగ్గజ, మాజీ ప్లేయర్లు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడు ధోని, విరాట్ కోహ్లీల గురించే మాట్లాడాలా? ఆ ప్లేయర్ కూడా ఓ లెజెండే అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్. మరి భారత దిగ్గజాలను కాదని భజ్జీ కితాబిచ్చిన ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీమిండియా దిగ్గజ ప్లేయర్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీలను కాదని హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించింది మరెవరి మీదో కాదు.. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోసిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ పై. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో సంచలన బ్యాటింగ్ తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు బట్లర్. దీంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కాస్తంత ముందుకెళ్లి బట్లర్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.

భజ్జీ మాట్లాడుతూ..”ప్రపంచ క్రికెట్ లో బట్లర్ ఒక ప్రత్యేకమైన, అసాధారణ ఆటగాడు.అతడి బ్యాటింగ్ వేరే లెవెల్ అంతే. అయితే ఇలాంటి ఆటతీరుతో ఆకట్టుకోవడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో చాలా మ్యాచ్ ల్లో బౌలర్లను ఊచకోత కోశాడు. భవిష్యత్ లో కూడా ఇదే కొనసాగుతుందని భావిస్తున్నాను. ఇక బట్లర్ భారత ప్లేయర్ కాదని అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. అదీకాక ఒకవేళ ఈ సెంచరీ కోహ్లీ చేసుంటే.. 2 నెలలు మాట్లాడుకునే వాళ్లం. ధోని కొట్టిన మూడు సిక్సుల గురించే మనం పెద్ద ఎత్తున చర్చిస్తాం. ఎప్పుడూ ధోని, కోహ్లీ గురించే మాట్లాడుకోవాలా? వారి గురించి ఎలా మాట్లాడుకుంటామో.. బట్లర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతడు కూడా ఓ క్రికెట్ లెజెండే” అంటూ బట్లర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. మరి భజ్జీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి