iDreamPost

Lord Rama Bank: రాముడి ప్రత్యేక బ్యాంకు.. సీతారాం అని 5 లక్షల సార్లు రాస్తేనే అకౌంట్!

బుధవారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు  ఘనంగా జరిగాయి. అలానే అయోధ్య నగరంలో అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇదే సమయంలో రాముడికి సంబంధించి బ్యాంకు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ప్రత్యేక రూల్స్ ఉన్నాయి.

బుధవారం దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు  ఘనంగా జరిగాయి. అలానే అయోధ్య నగరంలో అద్భుత ఆవిష్కరణ జరిగింది. ఇదే సమయంలో రాముడికి సంబంధించి బ్యాంకు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలంటే.. ప్రత్యేక రూల్స్ ఉన్నాయి.

Lord Rama Bank: రాముడి ప్రత్యేక బ్యాంకు.. సీతారాం అని 5 లక్షల సార్లు రాస్తేనే అకౌంట్!

నేడు దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు  ఘనంగా జరిగాయి. ప్రసిద్ధ రామలయ్య క్షేత్రాల్లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభంగా జరిగింది. ఇక రామ భక్తులు ఈ కల్యాణాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. అలానే నేడు అయోధ్యలోని రామ మందిరంలో అద్భుతం ఆవిష్కృతమైన సంగతి తెలిసింది. బాల రాముడి నుదుడిపై సూర్య కిరణాలు ప్రసరించాయి. అలానే రామయ్యకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే రాములోరికి ప్రత్యేకంగా బ్యాంకు ఉంది. ఇక్కడ ఖాతా తెరవాలంటే.. సీతారామ్ అని 5 లక్షల సార్లు రాయాల్సి ఉంటుంది. మరి.. ఈ బ్యాంకు ప్రత్యేకతలు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఏదైనా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే..ఆధార్ కార్డు వంటి కొన్ని ధృవీకరణ పత్రాలను సమర్పించి, కొంత మొత్తంలో డబ్బులతో ఖాతను తెరవచ్చు. అయితే రాముడికి సంబంధించిన ఓ  ప్రత్యేక బ్యాంకులో మాత్రం 5 లక్షల సార్లు  సీతారామ్ అని రాస్తే..మాత్రమే ఖాతా తెరుస్తారు. రాముడి నగరమైన అయోధ్యలో ఇంటర్నేషనల్ సీతారామ్ అనే బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు 1970 సంవత్సరంలో స్థాపించారు. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే ‘సీతారాం’ అని 5 లక్షల సార్లు రాయాలి. ఈ బ్యాంకులో 35 వేల మంది ఖాతాదారులు ఉన్నారు. అలానే ఈ బ్యాంకుకి సంబంధించిన వినియోదారులు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నారు. భారతదేశంతో పాటు, ఈ బ్యాంకుకు అమెరికా, బ్రిటన్, కెనడా, నేపాల్, ఫిజీ, యుఎఇ వంటి దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఖాతాదారులుగా ఉన్నారు.

అలానే ఈ బ్యాంకుకు దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా 136 శాఖలు ఉన్నాయి. మీ బ్యాంకులో ఎంతో మంది ఖాత తెరిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బ్యాంకులో ఖాతా తెరవాలంటే బుక్‌లెట్‌పై సీతారాం అని 5 లక్షల సార్లు రాయాలి. అప్పుడే మీ ఖాతా తెరిచి పాస్‌బుక్ జారీ చేస్తారు. అయోధ్యలో ఏర్పడిన ఈ బ్యాంకు భక్తుల నుంచి స్వీకరించిన 2,00,000 కోట్ల సీతారాముల బుక్‌లెట్లను కలిగి ఉంది. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్టించిన తరువాత ఎక్కువ ప్రయోజనం కూడా ఈ బ్యాంకుకే దక్కింది. బాల రాముడిని ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఈ బ్యాంకు మేనేజర్ తెలిపారు. ఈ బ్యాంక్ ప్రతి  అకౌంట్ ను ను ట్రాక్ చేస్తుంది. అలానే ఈ బ్యాంకు తన కస్టమర్లకు ఉచిత బుక్‌లెట్, రెడ్ పెన్ను బహుమతిగా ఇస్తుంది.

అలానే ఇక్కడ ఇచ్చే రుణాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మూడు వేర్వేరు రూపాల్లో రుణం అందజేస్తుంది.  మొదటి రుణం కర్మ కాలపరిమితి అని చెప్పాలి. అలానే రుణాన్ని తిరిగి చెల్లించడానికి నిర్ణీత సమయం ఇవ్వబడుతుంది. ఈ బ్యాంక్ పూర్తిగా భారతదేశ బ్యాంకింగ్ నిబంధనలనే అనుసరిస్తుంది. ఈ బ్యాంక్ లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి 8 నెలల గడువు ఇస్తారు. అప్పుడు 1.25 లక్షల సార్లు రాముడి పేరు రాయాల్సి ఉంది. ఈ బ్యాంకులో అకౌంట్ తెరిచిన ఏ భక్తుడైనా ఈ మూడు విషయాలతో లావాదేవీలు జరిపి అపారమైన శాంతిని పొందుతాడంట. మొత్తంగా ఈ బ్యాంకు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మరి.. ఈ బ్యాంకు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి