iDreamPost

శ్రీరామ నవమి నాడు అయోధ్యలో మహా అద్భుతం! చూసి తరించండి!

శ్రీరామ నవమిని పురస్కరించుకుని రామాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక స్పెషల్ పందిళ్లు వేసి.. రామునికి కళ్యాణం నిర్వహిస్తున్నారు కొంత మంది భక్తులు. అలాగే అయోధ్య రామాలయం శోభయామానంగా ముస్తాబైంది. ఇదే సమయంలో ఓ సుందర దృశ్యం అవిష్కృతం అయ్యింది

శ్రీరామ నవమిని పురస్కరించుకుని రామాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక స్పెషల్ పందిళ్లు వేసి.. రామునికి కళ్యాణం నిర్వహిస్తున్నారు కొంత మంది భక్తులు. అలాగే అయోధ్య రామాలయం శోభయామానంగా ముస్తాబైంది. ఇదే సమయంలో ఓ సుందర దృశ్యం అవిష్కృతం అయ్యింది

శ్రీరామ నవమి నాడు అయోధ్యలో మహా అద్భుతం! చూసి తరించండి!

ఎన్నో ఏళ్ల నాటి హిందువుల కల ఈ ఏడాదితో తీరింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బాల రాముని ప్రతిష్టాపన జరిగింది. ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు తిలకించి పులకించి పోయారు. ఇదిలా ఉంటే..ఏప్రిల్ 17న శ్రీ రామ నవమిని పురస్కరించుకుని భక్తులు భక్తి భావంలో మునిగి తేలుతున్నారు. భక్తులంతా రామాలయాలను సందర్శించి పులకించిపోతున్నారు. ‘జై శ్రీరామ్’నినాదాలతో దేవాలయాలు మారుమోగిపోతున్నాయి. భక్తులంతా అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. అలాగే అయోధ్యలోని బాల రాముని విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు చేశారు పండితులు.

శ్రీరామ నవమి రోజున అయోధ్యలో ఓ అద్భుతం సాక్షాత్కరించింది. 51 అంగుళాల పొడవుతో ఉన్న 5 ఏళ్ల బాల రాముడి విగ్రహాన్ని ఆ సూర్యని కిరణాలు తాకాయి. బాలరాముని నుదిటిపై నేరుగా సూర్య కిరణాలు పడ్డాయి. సుమారు 6 నిమిషాల పాటు ఆ సూర్య భగవానుడు నుదిటిని ముద్దాడాడు. దీంతో విగ్రహం నీలం రంగులోకి మారి.. మరింత అందంగా దర్శనమివ్వనున్నాడు ఈ బాల రాముడు. దీన్ని కన్నులారా చూసిన భక్తులు.. మరింత భక్తి భావంతో మునిగి తేలిపోతున్నారు. అది కూడా శ్రీరామ నవమి రోజున మాత్రమే తిలకించే అవకాశం ఉంది. దీన్నే సూర్యాభిషేకం లేదా సూర్య తిలకం అంటారు.  సూర్యుని కిరణాలు రామ్ లుల్లా నొసటిన తాకే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించి నిర్మించారు.

ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున మాత్రమే ఈ అద్బుత దృశ్యం భక్తులను కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు శ్రీరాముడిని గర్భగుడిలోని రామ్ లుల్లా నుదిటిన సింధూరంగా మారాడు సూర్యుడు. ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించి సరిగ్గా శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్య కిరణాలు అతడి నుదిటిపై వెలిగేలా సిద్ధం చేశారు. దీని కోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని నమ్ముతారు. సూర్యుడు ఆ సమయంలో అత్యంత ప్రభావంతో ఉంటాడు.రామ్ లల్లా నుదుటిపై సూర్య తిలకం దిద్దే ఈ అద్భుత దృశ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. ఈ సుందర దృశ్యాన్ని కన్నులారా తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వెళ్లారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి