iDreamPost

India Spice Exports: భారతీయ మసాలాపై ఆరోపణలు! ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల వ్యాపారం!

ప్రపంచ మార్కెట్ లో భారతీయ మసాలా దినుసులు ఎంతో ఫేమస్. అందుకే ప్రపంచ మార్కెట్ లో మన దేశం మసాలా వ్యాపారమే అధికంగా ఉంది. అయితే తాజాగా ఓ విషయం వెలుగులోకి రావడంతో ప్రపంచ మార్కెట్ భయపడుతోంది.

ప్రపంచ మార్కెట్ లో భారతీయ మసాలా దినుసులు ఎంతో ఫేమస్. అందుకే ప్రపంచ మార్కెట్ లో మన దేశం మసాలా వ్యాపారమే అధికంగా ఉంది. అయితే తాజాగా ఓ విషయం వెలుగులోకి రావడంతో ప్రపంచ మార్కెట్ భయపడుతోంది.

India Spice Exports: భారతీయ మసాలాపై ఆరోపణలు! ప్రమాదంలో రూ. 45 వేల కోట్ల వ్యాపారం!

ప్రపంచ మార్కెట్ లో భారతీయ మసాలా దినుసులకు ఉన్న  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్వం నుంచి కూడా భారతీయ మసాల దినుసులపై విదేశాలు ఎక్కువ మక్కువ చూపిస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మన దేశం మసాలా వ్యాపారమే అధికంగా ఉంది. అయితే తాజాగా ఓ విషయం వెలుగులోకి రావడంతో భారతీయ మసాలా దినుసులకు ప్రపంచ మార్కెట్ భయపడుతుంది. అలానే దాదాపు రూ.45 వేల కోట్ల వ్యాపారం ప్రమాదంలో పడిందని మార్కెట్ నిపుణలు భావిస్తున్నారు. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలే భారత దేశానికి చెందిన మసాలా నాణ్యత విషయంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. మసాలా ఎగుమతులకు సంబంధించిన నాణ్యత సమస్యలు ఉన్నట్లు బయటకు వచ్చింది. దీంతో ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ మసాలా నాణ్యతను పరీక్షించాయి. వాటి తర్వాత ఆస్ట్రేలియా కూడా మసాలా దినుసులను పరీక్షించడం ప్రారంభించింది. అదే విధంగా అమెరికా కూడా పరిశీలన జాబితాలో వీటిని పెట్టింది. ఈ దేశాల్లో చర్యలు తీసుకుంటే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల అంశంలో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలోనే భారతీయ మసాలా దినుసుల నాణ్యతపై రోజురోజుకూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆర్థిక పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) పేర్కొంది.

ప్రపంచ మార్కెట్లో భారతీయ మసాలదే అగ్రభాగం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్లన్నింటిలో రూ.45 వేల కోట్లకు పైగా ఈ మసాలా వాటా ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ మసాలా నాణ్యత లేమి అనేదానిపై ఇతర దేశాలు చర్యలు తీసుకుంటే ఈ మసాలా 50 శాతానికి పైగా నష్టపోవాల్సి రావచ్చు. ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత 4 దేశాల్లోని ప్రధాన మార్కెట్లలో ఏడు వందల మిలియన్ డాలర్లు  అంటే ఇండియన్ కరెన్సీలో 5800 కోట్ల విలువైన ఎగుమతులు ఇబ్బందుల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. పలు దేశాలు తీసుకునే నియంత్రణ చర్యలు మసాలా ఎగుమతుల్లో భారీ నష్టానికి దారితీయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారతీయ మసాలా నాణ్యత సమస్యలను త్వరగా.. పరిష్కరించాల్సిన అవసరం ఉందని జీటీఆర్ఐ నివేదిక పేర్కొంది. ఈ మసాలపై  విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

హాంకాంగ్, సింగపూర్ తమ ఉత్పత్తులలో క్యాన్సర్ కారక రసాయన ఇథిలీన్ ఆక్సైడ్‌ను గుర్తించిన తరువాత ప్రముఖ బ్రాండ్లు ఎవరెస్ట్ అమ్మకాలను నిషేధించాయి. దీంతో వాటిని తప్పనిసరిగా స్టోర్ల నుంచి రీకాల్ చేశారు. ఈ సంఘటనలలో ప్రాథమిక ఉల్లంఘనలలో ఇథిలీన్ ఆక్సైడ్, ధూమపానం కోసం ఫ్యూమిగేషన్ ఏజెంట్‌గా ఉపయోగించే కార్సినోజెన్ ఉనికి ఉందని నివేదిక పేర్కొంది. ఇక భారతీయ మసాల నాణ్యతపై జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలక విషయాలను తెలిపాడు. నాణ్యత విషయంలో భారతీయ మసాలా సరుకులను క్రమం తప్పకుండా ఈయూ తిరస్కరిస్తోంది. అదనంగా 2.5 బిలియన్ల విలువైన ఎగుమతులపై ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. మొత్తంగా భారతీయ మసాల దినుసుల నాణ్యాత లోపం వస్తున్న వార్తలు ప్రపంచ మార్కెట్ ను భయపెడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి