iDreamPost

రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఊహించని పేరు చెప్పిన హర్భజన్ సింగ్!

రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాను నడిపేది అతడే అంటూ ఎవ్వరూ ఊహించని క్రికెటర్ పేరు చెప్పుకొచ్చాడు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్. ఇంతకీ అతడెవరంటే?

రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాను నడిపేది అతడే అంటూ ఎవ్వరూ ఊహించని క్రికెటర్ పేరు చెప్పుకొచ్చాడు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్. ఇంతకీ అతడెవరంటే?

రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఊహించని పేరు చెప్పిన హర్భజన్ సింగ్!

రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ ఎవరు? ఐపీఎల్ జోరు కొనసాగుతున్న వేళ ఈ పిచ్చి ప్రశ్న ఏంటని మీకు అనుమానం రావొచ్చు. కానీ తాజాగా ఈ ప్రశ్న మరోసారి చర్చల్లోకి వచ్చింది. రోహిత్ తర్వాత టీమిండియాను నడిపించేది హార్దిక్ పాండ్యానే, టీ20 వరల్డ్ కప్ 2024లోనూ పాండ్యా టీమ్ ను ముందుకు నడిపిస్తాడు.. గత కొన్ని నెలల కిందట క్రీడా పండితులు, విశ్లేషకుల నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. కానీ వరల్డ్ కప్ 2023లో పాండ్యా గాయపడటంతో.. సీన్ కాస్త పూర్తిగా మారిపోయింది. అదీకాక హార్దిక్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో రోహిత్ తర్వాత టీమిండియాను నడిపేది అతడే అంటూ ఎవ్వరూ ఊహించని క్రికెటర్ పేరు చెప్పుకొచ్చాడు భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.

రోహిత్ శర్మ తర్వాత టీమిండియాను నడిపించే నాయకుడు ఎవరు అన్న ప్రశ్నకు గతంలో చాలా మంది హార్దిక్ పాండ్యా పేరు చెప్పారు. కానీ వరల్డ్ కప్ 2023 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గాయం కారణంగా ఆ మెగాటోర్నీకి దూరమైన పాండ్యా.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. కానీ అతడు ప్రస్తుతం ఉన్న ఫామ్ బట్టీ చూస్తే.. కెప్టెన్సీ సంగతి అటుంచి.. అసలు పొట్టి వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కుతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న పాండ్యా.. ఆ టీమ్ ను విజయవంతంగా నడిపించడంలో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో 5 ఓటములతో ప్లే ఆఫ్ రేసులో వెనకబడి ఉంది. తాజాగా రాజస్తాన్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ నిరూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతడికి టీ20 ప్రపంచ కప్ జట్టులోకి నేరుగా వచ్చే అర్హత ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు నెక్ట్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ ఎదుగుతాడు. ఇందులో మీకేమైనా సందేహాలు ఉన్నాయా?” అంటూ సంజూపై ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్ లో శాంసన్ టీమిండియా కెప్టెన్ కావాలని భజ్జీ ఆకాంక్షించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 రేసులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్ లు పోటీ పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో భజ్జీ శాంసన్ ను ఏకంగా కెప్టెన్ గా చూడాలని చెప్పడం ఆసక్తిగా మారింది. మరి రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి