iDreamPost
android-app
ios-app

HYD: డగ్స్ కేసులో ఎస్ఐని అరెస్ట్ చేసిన పోలీసులు!

ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ కమిషనరేట్ లో రాజేందర్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మహారాష్ట్రంలోని డ్రగ్స్ కేసులో భాగంగా ఓ ఆపరేషన్ చేశారు.

హైదరాబాద్ సంచలన కేసును చేదించారు పోలీసులు. పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూనే ఓ నేరానికి పాల్పడిన ఎస్ఐని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ కమిషనరేట్ లో రాజేందర్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మహారాష్ట్రంలోని డ్రగ్స్ కేసులో భాగంగా ఓ ఆపరేషన్ చేశారు. ఇందులో ఎస్ఐ రాజేందర్ టీమ్ మెంబర్ గా ఉన్నారు. కాగా ఈ ఆపరేషన్ లో అక్కడికి చేరుకుని నిందితుల వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అంతా బాగానే ఉన్నా.. సీజ్ చేసిన డ్రగ్స్ ను ఎస్ఐ రాజేందర్ కోర్టులో ప్రవేశపెట్టకపోవడం విశేషం. చాలా రోజులైనా అతడు డ్రగ్స్ ఆచూకి తెలపకపోవడంతో తాజాగా పోలీసులు అతని ఇంట్లో తనిఖీ చేశారు. దీంతో అతని ఇంట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కనిపించింది. ఇది చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కంచె చేను మేసింది అన్న చందంగా వ్యవహారించిన ఎస్ఐ రాజేందర్ పై పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అందులో నుంచి రెండు కేజీల డ్రగ్స్ ను ఎస్ఐ మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. రాజేందర్ ను గతంలో చాలా సార్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా కూడా చిక్కినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఈడీ దాడులు.. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లుగా గుర్తింపు