iDreamPost

హైదరాబాద్: మహిళకు రూ.10 లక్షల ఆఫర్ ఇచ్చిన యువకుడు! ఎందుకో తెలుసా?

హైదరాబాద్: మహిళకు రూ.10 లక్షల ఆఫర్ ఇచ్చిన యువకుడు! ఎందుకో తెలుసా?

ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ మార్పుతో లాభం కొంతుంటే, నష్టం అంతకు మించి ఉంటున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల లాభాన్ని పొందేవారు కొందరు ఉంటే.. దీన్ని ఆసరాగా చేసుకుని మోసం చేసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అవును.., సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఇప్పటికీ ఎంతో మంది మోసపోయారు, పోతూనే ఉన్నారు. అయితే ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా ఓ వివాహిత ఓ కేటుగాడి చేతిలో నిండా మోసపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని విశాఖకు చెందిన ఓ వివాహిత (26) బతుకు దెరువు కోసం గతంలో హైదబాద్ కు వచ్చి నగరంలోని దిల్ సుఖ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అక్కడక్కడ ఏదో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత నాలుగేళ్ల కిందట ఈ మహిళకు బోనాల చెన్నకేశవ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఈ మహిళ ఆర్థిక స్థితిగతులను పసిగట్టిన అతడు ఓ కన్నింగ్ ప్లాన్ గీశాడు. చెన్న కేశవ ఓ రోజు ఆ మహిళకు ఫోన్ చేసి.. ముఖానికి స్కార్ప్ వేసుకుని నీలి చిత్రాల్లో నటిస్తే దాదాపు రూ.10 లక్షల ఇస్తారని నమ్మించాడు.

చెన్నకేశవ మాటలు విన్న ఆ మహిళ షాక్ గురై ఆ తర్వాత నిరాకరించింది. అలా కొన్ని రోజులు గడిచింది. ఓ రోజు ఎందుకో ఆమెకు చెన్నకేశవ చెప్పిన మాటలు మరోసారి గుర్తొచ్చాయి. దీంతో మళ్లీ ఆలోచనలో పడింది. ఆ సమయంలో ఆమె బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు అందులో నటిస్తే రూ.10 లక్షలు వస్తాయి కదా అని ఆలోచించింది. వెంటనే చెన్న కేశవకు ఫోన్ చేసి నటిస్తానని చెప్పింది. ఆమె మాటలు విన్న అతగాడు ఎగిరిగంతేసినంత పని చేశాడు. ఇక మరుసటి రోజు ఆ మహిళకు ఫోన్ చేసి.. పంజాగుట్టలోని ఓ హోటల్ కు రావాలని పిలిచాడు. దీంతో ఆమె అతడు చెప్పిన చోటుకు వెళ్లింది. అనంతరం ఆమెను మద్యం తాగాలని చెన్న కేశవ కోరినట్లు తెలుస్తుంది. ఆమె నిరాకరించడంతో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అది తాగిన ఆ మహిళ పూర్తిగా మత్తులోకి వెళ్లిపోయింది.

దీంతో వెంటనే చెన్న కేశవ ఆమె ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా వీడియోలు తీశాడు. అలా ఓ గంట తర్వాత ఆమె తేరుకున్నాక అతడు ఆ మహిళకు ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ కు దిగాడు. నాకు రూ.1 లక్ష ఇవ్వాలని, లేకుంటే నీ వీడియోలను వెబ్ సైట్ పెడతానని బెదిరించాడు. ఇక అతని వేధింపులతో తట్టుకోలేకపోయిన ఆ మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి