iDreamPost

3 ఏళ్ల కిందట పెళ్లి.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి..!

3 ఏళ్ల కిందట పెళ్లి.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి..!

ఈ మహిళకు మూడేళ్ల కిందట శ్రీకాంత్ అనే యువకుడితో వివాహం జరిగినట్లు తెలుస్తుంది. కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. పెళ్లైన కొన్నాళ్లకి బతుకుదెరువు కోసం ఈ దంపతులు హైదరాబాద్ కు వచ్చారు. అప్పటి నుంచి భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా ఈ భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఈ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. భార్య ఇలా చేయడంతో భర్త తట్టుకోలేకపోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ గోదావరికి చెందిన శ్రీకాంత్-భవానీ దంపతులకు 3 ఏళ్ల కిందట వివాహం జరిగినట్లుగా సమాచారం. అయితే కొంత కాలానికి వీరికి ఓ కూతురు (02) పుట్టింది. ఇక సొంతూళ్లో పని లేకపోవడంతో గతంలో ఈ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. నగరంలోని కుషాయిగుడలోని హెచ్ బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త శ్రీకాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో భార్యాభర్తల మధ్య ఓ గొడవ జరిగింది.

దీంతో భవానీ తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త నిద్రపోయిన టైమ్ చూసిన ఈ మహిళ.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత భర్త కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయం మృతురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి