iDreamPost

హైదరాబాద్‌ లో విషాదం.. ఆఫీస్ కి వెళ్తుండగా దారుణం!

  • Published Jan 18, 2024 | 4:09 PMUpdated Jan 18, 2024 | 4:17 PM

ఉపాధి కోసం కన్న వాళ్లని, సొంత ఊరిని వదిలిపెట్టి వచ్చిన ఆ యువతి.. పరాయి ప్రాంతంలో అత్యంత దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..

ఉపాధి కోసం కన్న వాళ్లని, సొంత ఊరిని వదిలిపెట్టి వచ్చిన ఆ యువతి.. పరాయి ప్రాంతంలో అత్యంత దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..

  • Published Jan 18, 2024 | 4:09 PMUpdated Jan 18, 2024 | 4:17 PM
హైదరాబాద్‌ లో విషాదం.. ఆఫీస్ కి వెళ్తుండగా దారుణం!

చావును ఊహించడం, తప్పించడం మన చేతుల్లో ఉండదు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం.. ఉన్నట్లుండి కుప్ప కూలుతున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఇ​క ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాపం పండగలకు సొంత ఊళ్లకు బయలు దేరిన వారు.. ఇంటి నుంచి సంతోషంగా తిరిగి వస్తున్న వారిలో కొందరు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు విడిచిన సంఘటనలు చూశాం. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌, భరత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆఫీసుకు బయలుదేరిన యువతి.. అర్థాంతరంగా తనువు చాలించింది. బస్సు చక్రాల కింద నలిగి.. అత్యంత దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..

కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన పిట్టల వెంకటస్వామి కుమార్తె అయిన సునీత(26) అనే యువతి కూకట్ పల్లిలో నివాసం ఉంటూ.. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో నేడు అనగా జనవరి 18, గురువరాం ఉదయం డ్యూటీకి వెళ్లడం కోసం ఇంటి నుంచి బయలుదేరింది. ఈక్రమంలో కూకట్‌పల్లి నుంచి వెళ్తూ.. భరత్ నగర్ ఫ్లై ఓవర్ ఎక్కింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ మీద ఉన్న వాటర్‌ ట్యాంకర్‌ యువతి స్కూటీని వెనక నుంచి ఢీ కొట్టింది. దాంతో సునీత స్కూటీ మీద నుంచి కిందపడింది. అయితే అప్పటికీ ఆ యువతికి ఏం కాలేదు. హమ్మయ్య పెద్ద ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకునేలోపే.. మృత్యువు ఆర్టీసీ బస్సు రూపంలో దూసుకువచ్చింది.

ట్యాంకర్‌ ఢీకొట్టడంతో సునీత రోడ్డుపై పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ పక్క నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఆమె పైనుంచి వెళ్లింది. దాంతో బస్సు చక్రాల కింద నలిగి అక్కడిక్కడే సునీత మృతి చెందింది. వాటర్ ట్యాంకర్ వెనక నుంచి ఢీకొట్టినా.. ప్రాణాలతో బయటపడిన యువతి.. ఆ పక్కనే వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోవటం చూసిన వారు విస్మయానికి గురయ్యారు. ప్రమాదం నుంచి తప్పించుకుంది అనుకునేలోపే మృత్యు ఒడిలోకి చేరింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం గురించి తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్‌ను చూసేందుకు అటుగా వెళ్లే వాహనదారులు ఆగిపోవడంతో.. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి