iDreamPost

హైదరాబాద్ లో దారుణం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి

హైదరాబాద్ లో దారుణం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం చిన్నారిని ఆమె తండ్రి బైక్ పై స్కూల్ కు తీసుకెళ్తుండగా ఉన్నట్టుండి నడి రోడ్డుపై కింద పడిపోయింది. ఇదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న స్కూల్ ఆ పాప మీద నుంచి వెళ్లడంతో ఆ చిన్నారి తల నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి కళ్లముందే కూతురు చనిపోవడంతో అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రాంతంలో కిశోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి దీక్షిత (8) అనే కూతురు ఉంది. ఈ చిన్నారి స్థానిక స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే, బుధవారం ఉదయం కిశోర్ కూతురు దీక్షితను బైక్ పై స్కూల్ కు తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే కూతురుని ద్వి చక్రవాహనంపై ఎక్కించుకుని స్కూల్ కు వెళ్తున్నాడు. ఇక స్థానింకగా ఉనన ఓ ల్యాబరేటరీస్ వద్దకు రాగానే ఆ చిన్నారి ఉన్నట్టుండి బైక్ మీద నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. ఇదే సమయంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన స్కూల్ బస్సు ఆ చిన్నారిపై నుంచి వెళ్లింది.

దీంతో దీక్షిత తల ఆ బస్సు చక్రల కింద నలిగిపోయి నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి కళ్లముందే కూతురు మరణించడంతో అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా.. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తేల్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారిది.

ఇది కూడా చదవండి: ఒక్కగానొక్క కూతురు.. స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్లి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి