iDreamPost

99 రూపాయలకే థియేటర్ సినిమా

ఆ మధ్య నేషనల్ సినిమా డే ఆఫర్ కింద దేశవ్యాప్తంగా టికెట్ రేట్ ని 75కి అమ్మడంతో అప్పట్లో బ్రహ్మాస్త్రకు అద్భుతంగా పని చేసి వసూళ్లకు బాగా దోహదపడింది. తాజాగా పివిఆర్ మరోసారి అలాంటి ఆఫర్ తీసుకొచ్చింది.

ఆ మధ్య నేషనల్ సినిమా డే ఆఫర్ కింద దేశవ్యాప్తంగా టికెట్ రేట్ ని 75కి అమ్మడంతో అప్పట్లో బ్రహ్మాస్త్రకు అద్భుతంగా పని చేసి వసూళ్లకు బాగా దోహదపడింది. తాజాగా పివిఆర్ మరోసారి అలాంటి ఆఫర్ తీసుకొచ్చింది.

99 రూపాయలకే థియేటర్ సినిమా

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మల్టీప్లెక్సులు కొత్త స్ట్రాటజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మధ్య నేషనల్ సినిమా డే ఆఫర్ కింద దేశవ్యాప్తంగా టికెట్ రేట్ ని 75కి అమ్మడంతో అప్పట్లో బ్రహ్మాస్త్రకు అద్భుతంగా పని చేసి వసూళ్లకు బాగా దోహదపడింది. తాజాగా పివిఆర్ మరోసారి అలాంటి ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 20న కేవలం 99 రూపాయలకు తమ చైన్ లోని ఏ స్క్రీన్ లో అయినా ఏ సినిమా అయినా సరే చూసే అవకాశం కలిగిస్తోంది. వీటిని ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు మినహాయించి అన్ని చోట్లా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ 112, ఏపీలో 100 రూపాయల ధరలు ఉండబోతున్నాయి

నిజానికి ఇలాంటి స్కీంలు ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు మొగ్గు చూపుతారు. ఒక మధ్య తరగతి కుటుంబం హాలుకు రావాలంటే కనీసం 2 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అదనంగా స్నాక్స్ రేట్లు పెద్ద గుదిబండగా మారాయి. దాంతో రెండు మూడు వారాలకు మించి హిట్ సినిమాలకు సైతం లైఫ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పివిఆర్ లాంటి ఒకటి రెండు కార్పొరేట్ సంస్థలే కాకుండా సింగల్ స్క్రీన్లు కూడా ఇచ్చేలా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఈ దిశగా ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు అవసరం లేదు కనీసం చిన్న సినిమాలైనా వెసులుబాటు ఇవ్వాలి.

ఈ ఆఫర్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి లేటెస్ట్ హిట్స్ చూసే ఛాన్స్ ఉంది. ఆన్ లైన్ లో ప్రస్తుతానికి చూపించడం లేదు కానీ ఒకవేళ పెడితే మాత్రం క్షణాల్లో సోల్డ్ అవుట్ కావడం ఖాయం. అవతార్ 2 ది వే అఫ్ వాటర్, ధమాకా, వారసుడు, తెగింపులను మిస్ చేసుకున్న ఆడియన్స్ దీన్ని వాడుకోవచ్చు. ఓటిటిల కాలంలో పబ్లిక్ ని టికెట్లు కొని బిగ్ స్క్రీన్ మీదే సినిమా ఎంజాయ్ చేసేలా మార్పు తేవాలంటే ఇలాంటివి అవసరం. అసలే నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఏడాది మొత్తం ఏమేం కొత్త మూవీస్ రిలీజ్ చేయబోతున్నామో ముందే చెప్పేస్తున్న ట్రెండ్ లో జనాల మైండ్ సెట్ ని ప్రభావితం చేయడం సులభం కాదు. అందుకే అప్పుడప్పుడూ ఈ స్కీంలు కావాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి