iDreamPost

కూతురే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ! ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన వార్త!

  • Published May 07, 2024 | 12:55 PMUpdated May 07, 2024 | 1:14 PM

TS Inter Results 2024: కుమార్తె మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న ఓ తండ్రి.. బిడ్డ చేసిన పనికి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన చూసిన వారు.. ప్రతి ఆడపిల్ల ఈ కథ తెలుసుకోవాలి అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

TS Inter Results 2024: కుమార్తె మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న ఓ తండ్రి.. బిడ్డ చేసిన పనికి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన చూసిన వారు.. ప్రతి ఆడపిల్ల ఈ కథ తెలుసుకోవాలి అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published May 07, 2024 | 12:55 PMUpdated May 07, 2024 | 1:14 PM
కూతురే ప్రాణంగా బతికిన ఓ తండ్రి కథ! ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన వార్త!

చదువంటే మంచి, చెడు విచక్షణ తెలిపి… మనిషి, జంతువులా కాకుండా.. విజ్ఞతతో ప్రవర్తించే విధంగా ముందుకు నడిపే జ్యోతి. చీకటిని పారదోలి.. మనిషి జీవితంలోకి వెలుగులు తీసుకువచ్చేది విద్య. చదువు ఎలా ఉండాలంటే.. మనిషిలో తెలుసుకోవాలనే కోరికను రగిలించాలి తప్ప.. అమ్మో అనేలా భయపెట్టకూడదు. పూర్వం గురుకులాలు ఉన్నంత వరకు మన విద్యా వ్యవస్థ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే ఎప్పుడైతే బ్రిటీష్‌ పాలన ప్రారంభమైందో.. అప్పటి నుంచి భారతీయ సమాజం పూర్తిగా నాశనం అయ్యింది. ఎక్కువగా నష్టం వాటిల్లింది విద్యా వ్యవస్థకే. అప్పటి వరకు మన చదువులు.. జీవితాన్ని బోధించేవిగా ఉండేవి.. కానీ బ్రిటీష్‌ పాలనలో అది పూర్తిగా ధ్వంసమై.. బట్టీ విధానం అమల్లోకి వచ్చింది.

ఇక మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల మీద చదువు పేరుతో ఒత్తిడి విపరీతంగా పెరగసాగింది. ఇప్పుడు చదువంటే మార్కులు, ర్యాంకుల వేటగా మారిపోయింది. ఈ పరుగులో ఏమాత్రం వెనకబడినా.. రాణించలేకపోయినా.. తల్లిదండ్రులు అవమానంగా భావిస్తున్నారు. ఆ భయంతో అభం శుభం తెలియని పసి వాళ్లు.. ప్రాణాలు సైతం తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఇక తాజాగా ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన ఓ యువతి చేసిన పనికి ఆమె తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

తాజాగా వెల్లడైన ఇంటర్‌ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలైందన్న బాధతో.. అవమానం తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కుమార్తె చేసిన పనికి.. ఆ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాదం హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమార స్వామి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. వీరిలో చిన్న కూతురు శ్రీవిద్య హనుమకొండలోని ప్రైవేట్‌ కాలేజలో ఇంటర్‌ చదివింది. గతేడాది ఆమె కోర్సు ముగిసింది. కానీ కొన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిలైంది.

దాంతో ఈ ఏడాది ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. కానీ మళ్లీ ఫెయిలైంది. రెండుసార్లు ఫెయిల్‌ కావడంతో.. తండ్రి ఆమెను మందలించాడు. అప్పటికే ఫెయిలై మనస్థాపంతో ఉన్న శ్రీవిద్య.. తండ్రి తిట్టడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే పరకాలలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

తన వల్లే తన బిడ్డ ఇప్పుడు మృత్యువుతో పోరాడుతుందని.. బిడ్డ పరిస్థితికి తానే కారణమని.. ఇక తాను బతికి ఉండి లాభం లేదని భావించాడు. ఈ క్రమంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో పరకాలలోని ఓ ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు సేవించి మృతి చెందాడు.

ఓ వైపు కూతురు చావుబతుకుల మధ్య కొట్టామిట్టాడుతుండటం.. మరోవైపు తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుమార్తె ప్రాణంగా బతికిన తండ్రి.. బిడ్డ చేసిన పనికి చివరకు ప్రాణాలే తీసుకున్నాడు. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు మార్కులే లోకం కాదు.. మీమీదే ప్రాణాలు పెట్టుకున్న కన్నవారి గురించి ఓ సారి ఆలోచించండి అంటూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి