iDreamPost

అక్కినేనిని హేళన చేయడమేంటి బాలయ్యా!

అక్కినేనిని హేళన చేయడమేంటి బాలయ్యా!

ఎదిగేకొద్దీ ఒదగాలని సంస్కారం పెంచుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు. అదేంటో బాలకృష్ణ మాత్రం దీనికి భిన్నమైన రీతిలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అభిమానులు పసిపిల్లాడి మనస్తత్వం అని ఏదో కవరింగ్ చేస్తారు కానీ వాస్తవానికి చూస్తే చాలా సందర్భాల్లో తన స్థాయికి తగని మాటలతో పలుచన కావడం గతంలో చూశాం. నిన్న జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవం సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ నాన్న గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కడికి సంతోషం. ఎస్వి రంగారావు తదితరుల ప్రస్తావన తీసుకొచ్చి అక్కినేని తొక్కనేని అనేశారు. ప్రాస కోసం ఏదో ఫ్లోలో వెళ్లినట్టు ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు కానీ అక్కడేం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది

ఏఎన్ఆర్ అంటే స్వర్గీయ ఎన్టీఆర్ సమకాలీకులు. ఇద్దరూ కలిసి 14 మల్టీ స్టారర్స్ లో నటించారు. తెలుగు సీమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే మాయ బజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ వీళ్ళ కలయికలో వచ్చినవే. చివరి దాకా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. తండ్రితో అంత గొప్ప స్నేహం ఉన్న అక్కినేనిని పట్టుకుని ఇలా తొక్కనేని అనడం ఎంత మాత్రం క్షమార్హం కాదనేది నెటిజెన్లు ఓపెన్ గా చేస్తున్న కామెంట్. పోనీ ఏదో స్పృహలో లేనప్పుడో అపస్మారకంగా ఉన్నప్పుడంటే ఏదో అనుకోవచ్చు కానీ ముందస్తుగా ప్రిపేర్ అయ్యి వచ్చే ఇలాంటి ఈవెంట్లలో పబ్లిక్ స్టేజి మీద చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిరంజీవి లాంటి వాళ్ళు ప్రత్యేకత నిలుపుకుంది ఇందులోనే.

ఏది ఏమైనా బాలయ్య చేసింది ముమ్మాటికీ తప్పే. అక్కినేని అనేది కేవలం ఇంటి పేరు కాదు. ఒక లెగసి. రెండు వందలకు పైగా సినిమాలు చేసిన సుదీర్ఘ అనుభవ గని. అలాంటిది ఏమరుపాటుగా అన్నా ఒప్పు అయిపోదు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని నాగార్జున ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యతో పోటీకి వెళ్లి సంక్రాంతి సీజన్ తో గట్టెక్కిన వీరసింహారెడ్డి విజయం అలా బాలయ్య కళ్ళను కమ్మేసిందో ఏమో కానీ చాలా విమర్శలకు చోటిచ్చారు. మైకు దొరికితే ఏదో ఒకటి ఎవరైనా మాట్లాడతారు. కానీ పదుగురు మెచ్చేలా వివాదాలు రాకుండా చూసుకోవాల్సింది సినిమా సెలబ్రిటీలే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి