iDreamPost

వాల్తేరు వీరయ్య 10 రోజుల కలెక్షన్లు

విపరీతమైన పోటీ, థియేటర్ల కొరత లాంటి ఇబ్బందులను తట్టుకుని మరీ విజేతగా నిలిచింది. రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల షేర్ దాటేసి ట్రేడ్ నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు వీరసింహారెడ్డి డెబ్భై కోట్ల మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతుంటే వారసుడు దాని బిజినెస్ రేంజ్ కు తగ్గట్టు సేఫ్ అయిపోయింది.

విపరీతమైన పోటీ, థియేటర్ల కొరత లాంటి ఇబ్బందులను తట్టుకుని మరీ విజేతగా నిలిచింది. రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల షేర్ దాటేసి ట్రేడ్ నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు వీరసింహారెడ్డి డెబ్భై కోట్ల మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతుంటే వారసుడు దాని బిజినెస్ రేంజ్ కు తగ్గట్టు సేఫ్ అయిపోయింది.

వాల్తేరు వీరయ్య 10 రోజుల కలెక్షన్లు

పూనకాలు లోడింగ్ అని ఏ ముహూర్తంలో క్యాప్షన్ పెట్టుకున్నారో కానీ దానికి పూర్తి సార్థకత చేకూరుస్తూ వాల్తేరు వీరయ్య వసూళ్ల సునామి పది రోజులు పూర్తి చేసుకుంది. విపరీతమైన పోటీ, థియేటర్ల కొరత లాంటి ఇబ్బందులను తట్టుకుని మరీ విజేతగా నిలిచింది. రెండు వారాలు దాటకుండానే వంద కోట్ల షేర్ దాటేసి ట్రేడ్ నివ్వెరపోయేలా చేసింది. మరోవైపు వీరసింహారెడ్డి డెబ్భై కోట్ల మార్కును అందుకోలేక ఇబ్బంది పడుతుంటే వారసుడు దాని బిజినెస్ రేంజ్ కు తగ్గట్టు సేఫ్ అయిపోయింది. తెగింపు అమ్మిందే తక్కువ కావడంతో నిర్మాతకు నష్టాలేం లేవు. కళ్యాణం కమనీయం వాష్ అవుట్ దెబ్బకు ప్రొడ్యూసర్ రివర్స్ లో అద్దెలు భరించాల్సి వచ్చింది.

ఇక వీరయ్య లెక్కల విషయానికి వస్తే పది రోజులకు గాను 114 కోట్ల షేర్ ని రాబట్టుకున్నట్టు ఎగ్జిబిటర్ రిపోర్ట్స్. గ్రాస్ సుమారు 195 కోట్లకు పైగా ఉంటుంది. డబుల్ సెంచరీని ఇంకో రెండు మూడు రోజుల్లో అందుకోవచ్చు. ఏరియాల వారిగా షేర్లు చూసుకుంటే నైజామ్ 31 కోట్ల 40 లక్షలు, సీడెడ్ 16 కోట్ల 8 లక్షలు, ఉత్తరాంధ్ర 14 కోట్ల 39 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 15 కోట్ల 40 లక్షలు, గుంటూరు 7 కోట్ల 15 లక్షలు, కృష్ణా 9 కోట్ల 95 లక్షలు, నెల్లూరు 3 కోట్ల 65 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 7 కోట్ల 35 లక్షలు, ఓవర్సీస్ 11 కోట్ల 75 లక్షలు మొత్తం కలిపి నూటా పధ్నాలుగు కోట్ల దాకా అవుతుంది. ఇంకా ఫైనల్ రన్ కు చాలా టైం ఉన్న నేపథ్యంలో భారీ ఫిగర్లను ఆశించవచ్చు

వాల్తేరు వీరయ్యకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ 88 కోట్లు. అంటే ఆల్రెడీ లాభం కింద పాతిక కోట్లు వచ్చేశాయి. ఇంకో పదిహేనుకు పైగా సులభంగా అందుకోవచ్చు. దగ్గరలో పోటీ ఏదీ లేదు. పఠాన్ తెలుగు మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు. సుధీర్ బాబు హంట్ మీద బజ్ లేదు. సో ఇంకో రెండు వీకెండ్లు మెగాస్టార్ కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉండటం వీరయ్యకు కలిసి వస్తోంది. చాలా సెంటర్లలో నాన్ ఆర్ఆర్ఆర్, ఎస్ఎస్ఆర్ రికార్డులు వచ్చి పడ్డాయి. నైజామ్ లో ఏళ్ళ తర్వాత చిరు డామినేషన్ మార్కెట్ మీద కనిపించింది. ఇదే ఉత్సాహంతో ఇకపై మాస్ సినిమాలే చేస్తానంటున్నారు మెగాస్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి