iDreamPost

బ్రేకింగ్: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో గురువారం ఉదమం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో గురువారం ఉదమం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బ్రేకింగ్: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

గత కొన్నిరోజుల నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, మరో రెండు రోజల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై స్కూల్స్ కు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తెలంగాణలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు కొడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో చలి గాలులు వీస్తున్నాయి. అయితే, గురువారం వాతవరణం మరింత మారిపోయింది.

దీంతో హైదరాబాద్ లోని కొన్నిప్రాంతాలు ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది. కాగా, స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే సమయానికి వర్షం కురవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, బాలాపూర్, మీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, మాధాపూర్, మసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, లక్డీకాపుల్, నాంపల్లితో పాటు కోఠి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో వర్ష సూచన ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు సిద్దంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి