iDreamPost

మాంసం ప్రియులుకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు!

Chicken Price: చాలామందికి నాన్ వేజ్ లేనిదే ముద్ద దిగదు. అలానే సండే వచ్చిందంటే.. దాని నాన్ వేజ్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మాంసం ప్రియులకు అయితే నాన్ వేజ్ ధరలు తగ్గాయంటే.. అదో పెద్ద పండగలా అనిపిస్తుంది. తాజాగా కూడా మాంసం ప్రియులకు ఓ గుడ్ న్యూస్.

Chicken Price: చాలామందికి నాన్ వేజ్ లేనిదే ముద్ద దిగదు. అలానే సండే వచ్చిందంటే.. దాని నాన్ వేజ్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మాంసం ప్రియులకు అయితే నాన్ వేజ్ ధరలు తగ్గాయంటే.. అదో పెద్ద పండగలా అనిపిస్తుంది. తాజాగా కూడా మాంసం ప్రియులకు ఓ గుడ్ న్యూస్.

మాంసం ప్రియులుకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు!

మాంసం ప్రియులకు శుభవార్త. వారాంతంలో చికెన్‌ ముక్కలు తింటూ కుటుంబంతో సరదాగా గడిపే సామాన్య నగర వాసులను చికెన్ ధరలు ఊరటనిచ్చాయి. ఇన్నాళ్లు నాలుగు ముక్కలు నోట్లు వేసుకోవాడనికి ధరను చూసి భయపడేవారు. అయితే తాజాగా చికెన్ ధరలు తగ్గడంతో.. ఇకపై రెండు ముక్కలతో ఎక్కువ తినే అవకాశం లభించింది. నిన్నటి మొన్నటి వరకు ఎక్కువగా ఉన్న చికెన్ తో పాటు ఇతర నాన్ వేజ్  ధరలు కాస్తా దిగి వచ్చాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సాధారణంగా చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. అందులోనూ కొందరు చికెన్ అంటే ఇష్టంగా పడిచస్తారు. ఇక సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్ వేజ్ ఐటమ్ తో ఇళ్లు గుమగుమలాడి పోతుంటాయి. చాలా ఇళ్లలో చికెన్ వంటలకాలే ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఈ మాంసం ధరలు భారీగా పెరిగిపోతాయి. అలాంటి సమయంలో చాలామంది బలవంతంగా నోరు కట్టుకుంటూ ఉంటారు. ఇక ధరలు తగ్గినపుడు మాత్రం వెంటనే చికెన్ షాపుల వైపు పరుగులు తీస్తారు. తాజాగా మాంసం ప్రియులకు అలాంటి ఛాన్సే వచ్చింది.

కొద్ది రోజులు క్రితం వరకు చికెన్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గుడ్లు, చేపల ధరలు కూడా కాస్త పెరిగి ప్రజలకు , ముఖ్యంగా మాంసం ప్రియులకు షాకి ఇచ్చాయి. దీంతో చాలా మంది నాన్ వేజ్ ప్రియులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  కొద్ది రోజుల నుంచి చికెన్ ధరలు తగ్గు ముఖ పట్టినట్లు తెలుస్తోంది. ఇక చికెన్ ధరల వివరాలను చూసినట్లు అయితే.. విత్ స్కిన్ చికెన్ వచ్చేసి కిలో 240, స్కిన్ లెస్ చికెన్ కిలో 260 ఉంది. అలానే ఫిష్ కిలో  130 కాగా, ప్రాన్స్ కిలో 250గా ఉంది.

అయితే ప్రాంతాలను బట్టి కాస్తా అటు ఇటు ఉండొచ్చు. కానీ కొన్ని రోజుల క్రితం వరకు చికెన్ 300 పైనే ధర ఉంది. దీంతో మధ్యతరగతి వాళ్లు చికెన్ తినేందుకు వెనుకడుకు వేశారు. అలానే మాంసం ప్రియులు కూడా రెండు ముక్కలతోనే సర్థుకునే వారు. కానీ తాజాగా చికెన్ ధరలు భారీగా తగ్గడం వారికి కాస్తా ఊరట నిచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఇదే సమయంలో కూరగాయాల ధరలు మాత్రం విపరీతంగా పెరిగుతున్నాయి. దీంతో చాలామంది ప్రజలు కూరగాయల కొనడం కంటే చికెన్ కొని తినడం మేలని అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి