iDreamPost

అయ్యో పాపం.. రెండు మార్కుల తేడాతో రామలక్ష్మణులు..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొందరికి మంచి అనుభూతిని కలిగిస్తే.. కొంతమందికి చేదు అనుభూతిని మిగిల్చాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ట్విన్స్ విషయంలో మాత్రం అయ్యో పాపం అనిపించకమానదు. ఎందుకంటే.. రెండే రెండు మార్కుల తేడాతో..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కొందరికి మంచి అనుభూతిని కలిగిస్తే.. కొంతమందికి చేదు అనుభూతిని మిగిల్చాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ట్విన్స్ విషయంలో మాత్రం అయ్యో పాపం అనిపించకమానదు. ఎందుకంటే.. రెండే రెండు మార్కుల తేడాతో..

అయ్యో పాపం.. రెండు మార్కుల తేడాతో రామలక్ష్మణులు..

మనం గమనిస్తే చాలా ఇళ్లలో ఇద్దరు పిల్లలు ఉంటే వారిలో ఒకరు మాత్రమే బాగా చదువుతారు. ముఖ్యంగా అబ్బాయిల గురించి మాట్లాడాల్సి వస్తే.. పెద్ద కొడుకు బాగా చదివితే.. చిన్న కొడుకు మాత్రం సోసోగానే చదువుతాడు. చాలా ఇళ్లలో ఉండేదే ఇది. అన్న ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే.. తమ్ముడు సెకండ్, థర్డ్ క్లాస్ లో పాస్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా ఉంటుంది. చాలా రేర్ కేసెస్ లో అయితేనే ఇద్దరూ బాగా చదువుతారు. అయితే ఈ ట్విన్స్ విషయంలో మాత్రం ఇద్దరూ టాపర్సే. కానీ రెండు మార్కుల తేడాతో ఒక రికార్డు మిస్ అయ్యింది. దీంతో రామలక్ష్మణులిద్దరూ కొంచెం అప్ సెట్ అయ్యారు పాపం. 

నల్గొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతులకు రామ్, లక్ష్మణ్ అనే కవలలు జన్మించారు. ఒకే రూపంతో పుట్టిన కారణంగా ఇద్దరికీ రామ్, లక్ష్మణ్ అనే పేర్లు పెట్టారు. అయితే పేర్లకు తగ్గట్టే ఆ రామలక్ష్మణుల్లా ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఉండేవారు. ఆ రామలక్ష్మణులు సకల విద్యల్లో ఆరితేరినట్టు.. ఈ రామలక్ష్మణులు కూడా బాల్యం నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉపాధ్యాయులు ఈ రామలక్ష్మణులిద్దరినీ ప్రశంసించేవారు. ఆత్మకూరు ఆదర్శ పాఠశాలలో ఇద్దరూ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎంపీసీలో ఉత్తమ ర్యాంక్ సాధించారు. అయితే ఇద్దరూ ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ ఒక రికార్డ్ అయితే మిస్ అయ్యింది.

రామ్ కి 981 మార్కులు రాగా.. లక్ష్మణ్ కి 983 మార్కులు వచ్చాయి. రెండే రెండు మార్కుల తేడాతో ఇద్దరి రికార్డ్ మిస్ అయ్యింది. లేదంటే రూపంలోనూ.. మార్కుల్లోనూ ఇద్దరూ ఒకటే అన్న రికార్డ్ క్రియేట్ అయ్యేది. రూపంలోనూ ఒకలాగే ఉన్నారు.. ఏ పని చేసినా ఒకలానే చేస్తారు. చదివినా కూడా ఒకలానే చదువుతారు. కానీ ఫలితాల్లో మాత్రం రెండు మార్కులు వీరిని కొంచెం వేరు చేసింది. లేదంటే రూపంలో లాగే చదువులోనూ ఇద్దరూ ఒకటే అని అనిపించుకునేవారు. ఇక ఉత్తమ మార్కులు సాధించిన రామ్, లక్ష్మణులిద్దరినీ ఆదర్శ పాఠశాల లెక్చరర్లు అభినందించారు. పిల్లలు సాధించిన ఘనతపై వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్, లక్ష్మణ్ లు మీడియాతో మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు, లెక్చరర్లు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని.. వారి వల్లే తాము ఉత్తమ మార్కులు సాధించగలిగామని అన్నారు. భవిష్యత్తులో తాము ఇంజనీర్లు అవ్వాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మరి ఈ రామ, లక్ష్మణులిద్దరూ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి