iDreamPost

ఎంతోమందికి సేవనందించిన స్టాఫ్​ నర్స్​.. ఒకరి నిర్లక్ష్యం కారణంగా..

  • Published Apr 27, 2024 | 10:06 PMUpdated Apr 27, 2024 | 10:06 PM

Staff Nurse Issue: ఎంతో మంది రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడిన ఓ స్టాఫ్ నర్సు జీవితం ఒక వ్యక్తి వల్ల ఛిన్నాభిన్నం అయ్యింది.. పది మందికి సేవ చేయాలన్న ఆమె సంకల్పాన్ని ఆవిరి చేసింది.

Staff Nurse Issue: ఎంతో మంది రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడిన ఓ స్టాఫ్ నర్సు జీవితం ఒక వ్యక్తి వల్ల ఛిన్నాభిన్నం అయ్యింది.. పది మందికి సేవ చేయాలన్న ఆమె సంకల్పాన్ని ఆవిరి చేసింది.

  • Published Apr 27, 2024 | 10:06 PMUpdated Apr 27, 2024 | 10:06 PM
ఎంతోమందికి సేవనందించిన స్టాఫ్​ నర్స్​.. ఒకరి నిర్లక్ష్యం కారణంగా..

ఆమెకు చిన్నప్పటి నుంచి పది మందికి సేవ చేయాలనే ఆలోచన.  కుటుంబ సభ్యులు కూడా ఆమెను చిన్ననాటి నుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. మానవ సేవయే మాదవ సేవ అన్న సూక్తితో ఆమె పదిమందికి సేవ చేసేందుకు నర్స్ కోర్సు చేసి ఎంతోమంది రోగులకు చికిత్స అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడింది. ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ.. వారి యోగక్షేమాల గురించి సొంత మనిషిలా పట్టించుకుంటుంది. అందుకే ఆ నర్సు అంటు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. స్టాఫ్ నర్సుగా ఎంతోమంది అభిమానం సంపాదించిన ఆ నర్సు జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఒక వ్యక్తి నిర్ల్యం కారణంగా ఆమె జీవితం చిన్నాభిన్నం అయ్యింది. పది మందికి సేవ చేస్తున్న ఆమె జీవితం అంతలోనే..

ఇటీవల దేశంలో ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, అది వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంతోమంది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి చికిత్స అందించి కాపాడే స్టాఫ్ నర్సు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీలోని రవి హాస్పిటల్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ప్రశాంతి తన స్కూటీపై కేపీహెచ్​బీ కాలనీ నుంచి కుకట్ పల్లి వైపు వెళ్తుంది. అదే సమయంలో మృత్యు రూపంలో ఆమె లారీ వెంటాడింది.

స్టాఫ్ నర్స్ ప్రశాంతి కూకట్ పల్లివైపు వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రశాంతి స్కూటీతో సహా ఎగిరి అవతల పడింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాలీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా అతివేగం పది మందికి సేవ చేసే నర్సును బలి తీసుకోవడంతో కుటుంబ సభ్యులు, సహ సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి