iDreamPost

నెల్లూరు జిల్లాలో హ్యాట్రిక్ YSRCP ఎమ్మెల్యేలు! వీరి గెలుపు ఖాయమా?

నెల్లూరు జిల్లా రాజకీయం రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ప్రత్యేకమైన తీర్పులు ఇస్తుంటారు. గత ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఈ సారీ కూడా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు.. హ్యాట్రిక్ కొట్టనున్నారంట.

నెల్లూరు జిల్లా రాజకీయం రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ప్రత్యేకమైన తీర్పులు ఇస్తుంటారు. గత ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఈ సారీ కూడా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు.. హ్యాట్రిక్ కొట్టనున్నారంట.

నెల్లూరు జిల్లాలో హ్యాట్రిక్ YSRCP ఎమ్మెల్యేలు! వీరి గెలుపు ఖాయమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా చాలా ప్రత్యేకం. ఈ జిల్లా నుంచి చాలా మంది నాయకులు రాష్ట్ర రాజకీయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని చరిత్ర చెబుతుంది. అలానే వైసీపీ పార్టీ వచ్చిన తరువాత.. అటువైపు నెల్లూరు జిల్లా మొగ్గు చూపుతుంది. రాష్ట్రంలో రాజకీయం మారినా సరే నెల్లూరు జిల్లాలో మాత్రం రాజకీయం మారేలా కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ వైసీపీ హావానే కనిపిస్తుంది. టీడీపీకి అనుకూల పవనాలు వీచిన సమయంలో కూడా నెల్లూరు జిల్లా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఇదే జరిగిన విషయం మనకు తెలిసిందే. 2024లో అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  వచ్చే ఎన్నికల్లో కొన్ని మార్పులు జరిగి.. వైసీపీ తరపున కొందరు అభ్యర్థులు మారిన, మరికొందరు మాత్రం హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగ అయ్యే ఛాన్స్ ఉంది. మరి.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలు అయ్యే ఆ వైసీపీ నేతలు ఎవరు ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.. సర్వేపల్లి నుంచి మరోసారి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంతబలమైన నేత కాదనేది స్థానికంగా వినిపిస్తున్న వార్త. ఇప్పటికే 2014, 2019లో వరుసగా విజయం సాధించిన కాకాణి.. 2024లో కూడా సర్వేపల్లి నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అలానే కావలి నియోజకవర్గం నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా మరోసారి వైసీపీ అభ్యర్థిగా నిలబడనున్నారు. ఆయన కూడా గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. 2024లో గెలిచి..హ్యాట్రిక్  కొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. కావలిలో టీడీపీకి ఏ మాత్రం  బలం కనిపించడం లేదు. పైగా మాజీ ఎమ్మెల్యే బీదమస్తాన్ రావు  వంటి నేతలు వైసీపీలోనే ఉన్నారు.   కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ గెలుపు విషయంలో సందేహాలు అక్కర్లేదన్న పరిస్థితి ఆ నియోజవర్గంలో ఉంది.

ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్  హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ వినిపిస్తోన్న వార్త. 2014, 2019 అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి విజయం సాధించారు.  గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలవడం కాస్త ఈ సారి గెలుపుపై సందేహం వ్యక్తం అవుతోంది. బలమైన టీడీపీ అభ్యర్థి ఉంటే, అనిల్ కు కష్టం అవుతుంది. కానీ, నెల్లూరు సీటి ప్రజలు అనిల్ వైపు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అనిల్ కుమార్ యాదవ్  కూడా హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తోన్నారు.

ఇక సూళ్లురుపేట ఎమ్మెల్యే  కిలివేటి సంజీవయ్య.. కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిలిచేవారి లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికే సూళ్లురు పేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థిగా  ఉండనున్నారని టాక్. దీంతో ఆయన ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే లిస్ట్ లో ఆయన కూడా చేరే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గతంలో  మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా  ఉన్నారు. ఆయన మరణం తరువాత మేకపాటి విక్రాంత్ రెడ్డి ఉపఎన్నికల్లో గెలిచారు. ఈయన హ్యాట్రిక్ కాకపోయిన.. ఈ కుటుంబలో వ్యక్తి మరోసారి విజయం సాధిస్తారు. ఇది వ్యక్తి హ్యాట్రిక్ కాకపోయినా.. మేకపాటి కుటుంబం హ్యాట్రిక్ అవుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయా పడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి