iDreamPost

నాకు లవ్ స్టోరీస్ నచ్చవ్.. కానీ నాది లవ్ మ్యారేజ్! ‘హరోం హర’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

హరోం హర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఆ చిత్ర దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

హరోం హర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఆ చిత్ర దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

నాకు లవ్ స్టోరీస్ నచ్చవ్.. కానీ నాది లవ్ మ్యారేజ్! ‘హరోం హర’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఏ దర్శకుడికి అయినా తన తొలి సినిమా కెరీర్ లో గుర్తుండిపోతుంది. అయితే కొంత మంది డైరెక్టర్లు తొలి మూవీతో హిట్ కొడితే.. మరికొంత మంది బోల్తా పడతారు. ఇంకొంత మంది తమ టేకింగ్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు డైరెక్టర్లు తమ ఫస్ట్ మూవీపై షాకింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి కామెంట్సే చేశాడు ‘హరోం హర’ దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక. హరోం హర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

‘హరోం హర’.. సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన పూర్తి ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ మూవీ. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేపడుతోంది. అందులో భాగంగా మూవీ యూనిట్ పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా డైరెక్టర్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఐడ్రీమ్ తో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.

“ఈ చిత్రంలో మీరు ఇదివరకు చూడని సుధీర్ బాబును చూస్తారు. ఆయన యాక్టింగ్ కు నేను ఫిదా అయ్యాను. అసలు అన్నీ కుదిరితే నా తొలి సినిమా ఇదే కావాల్సింది. ఇక ఫస్ట్ మూవీ ‘సెహరీ’.. ఓ లవ్ స్టోరీ. కానీ నాకు ప్రేమ కథలు అంటే ఇష్టం ఉండదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే? నాది లవ్ మ్యారేజ్. అయినా నాకెందుకో అలాంటి స్టోరీస్ నచ్చవు” అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ జ్ఞాన సాగర్ ద్వారక. హరోం హర మూవీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ పూర్తి ఇంటర్వ్యూ చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి