Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మీద భారత మాజీ క్రికెటర్ ఒకరు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యాన్స్ అందరూ హార్దిక్‌ను తిట్టాలన్నాడు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మీద భారత మాజీ క్రికెటర్ ఒకరు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యాన్స్ అందరూ హార్దిక్‌ను తిట్టాలన్నాడు.
Nidhan
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2024 షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించారు. అయితే తొలి విడత షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో 17 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇందులో 21 మ్యాచులు జరగనున్నాయి. మార్చి 22వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా లీగ్ మొదలవనుంది. ఈ సీజన్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశాల్లో ఒకటి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. రెండేళ్ల పాటు గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా ఉన్న హార్దిక్.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు మారిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ నుంచి పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతల్ని కూడా అప్పగించింది ముంబై మేనేజ్మెంట్. ఈ నేపథ్యంలో పాండ్యా ఎలా ఆడతాడు? టీమ్‌ను ఎలా నడిపిస్తాడు? అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యాన్స్ అందరూ పాండ్యాను తిట్టాలన్నాడు.
కెప్టెన్సీ ఇచ్చి ఫుల్ ఫ్రీడమ్‌తో టీమ్‌ను నడిపేలా హార్దిక్‌ను గుజరాత్ యాజమాన్యం ప్రోత్సహించింది. అభిమానులు కూడా అతడికి అండగా నిలబడ్డారు. అయినా అతడు మధ్యలోనే జట్టును వదిలేసి ముంబైకి వెళ్లిపోయాడు. దీంతో అతడిపై జీటీ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్‌లో హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేసుకొని అందరూ గట్టిగా అరవాలన్నాడు. ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ముంబై, కోల్‌కతా మధ్య వాంఖడేలో మ్యాచ్ జరిగినప్పుడు ఇలాంటి ఓ ఘటన జరిగిందన్నాడు. కేకేఆర్‌కు ఆడుతున్న అజిత్ అగార్కర్‌పై ఫ్యాన్స్ సీరియస్ అయ్యారని తెలిపాడు. దీంతో అతడ్ని బౌండరీ నుంచి బయటకు తీసుకెళ్లామన్నాడు ఆకాశ్ చోప్రా. ముంబై లోకల్ బాయ్ అయిన అగార్కర్.. కోల్‌కతాకు ఆడటాన్ని అభిమానులు జీర్ణించుకులేకపోయారని చెప్పాడు.
‘గుజరాత్‌ను ఒకసారి విన్నర్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. మరోసారి రన్నరప్‌గా నిలిపాడు. అలాంటోడు ఫ్రాంచైజీని వదిలేసి ఇప్పుడు ముంబైకి మారాడు. ఇందుకు అహ్మదాబాద్ అభిమానులు కచ్చితంగా బాధపడతారు. వాళ్లు హర్ట్ కాకపోతే అర్థమే ఉండదు. వాళ్లు బాధపడాలి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పాండ్యా మీద ఫ్యాన్స్ అరవాలి. హార్దిక్ టాస్కు వచ్చినప్పుడు అతడ్ని టార్గెట్ చేసుకొని అభిమానులు అరుస్తూ గోల చేయాలి. అప్పుడే లీగ్‌లో మరింత మెచ్యూరిటీ వస్తుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. హార్దిక్ వెళ్లడం వల్ల తమకు కలిగిన బాధను, ఎమోషన్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలన్నాడు మాజీ క్రికెటర్. అరుస్తూ, తిడుతూ, గోల చేస్తే వచ్చే మజాయే వేరన్నాడు. పాండ్యాపై ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతడికి సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు టీమ్ మారడం ప్లేయర్ ఇష్టం అంటున్నారు. ఇలా తిట్టమని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మరి.. పాండ్యాను తిట్టాలంటూ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ రోజు సచిన్ విశ్వరూపం చూసిన లోకం! క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘట్టం
Aakash Chopra wants Hardik Pandya to be booed in Ahmedabad during the Gujarat Titans vs. Mumbai Indians match on March 24th. pic.twitter.com/jCiwIdfHub
— CricTracker (@Cricketracker) February 23, 2024