iDreamPost

సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన జావేద్ హబీబ్.

సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన జావేద్ హబీబ్.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పథకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పథకాన్ని నేడు అమలులోకి తీసుకుని వచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా షాపులు ఉన్న రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు ఏటా 10వేలు ఆర్ధిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చినట్టుగానే నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,47,040 మందికి ఆర్ధిక సహాయాన్ని అందచేశారు. దీనికోసం ప్రభుత్వం 247.04 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ పథకంపై ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ప్రశంశల వర్షం కురిపించారు. కరోనాతో మొత్తం ప్రపంచమే స్తంభించిపోయిందని అనేక మంది మాదిరే నాయి బ్రాహ్మణుల జీవన శైలిలో కుడా మార్పులు వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి అండగా ఉండి జగన్ అన్న చేదోడు ద్వారా ఆర్థిక సహాయం చేయడం హర్షించదగ్గ విషయం అని ఇలా ఆదుకోవడం దేశంలోనే ప్రథమం అని దీనికి సీఎం జగన్ గారికి ధన్యవాదాలు అని తన ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు.