iDreamPost

క్యూట్ లుక్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీనే కుదిపేస్తోంది..!

Actress Childhood Photo: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన రేర్ పిక్స్, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Actress Childhood Photo: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు తమకు సంబంధించిన రేర్ పిక్స్, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

క్యూట్ లుక్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీనే కుదిపేస్తోంది..!

ఇటీవల సినీ సెలబ్రెటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెండితెర, బుల్లితెర నటీమణులు సోషల్ మాద్యమాల ద్వారా తమ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు, మూవీ అప్ డేట్ గురించి ముచ్చటిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోయిన్లుగా తమ సత్తా చాటుతున్నారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్లు గా మారుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి క్యూట్ ఫోటో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు ఆ పాప తెలుగు ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఆ పాప ఎవరో తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్తగా వస్తున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది సక్సెస్ బాటలో నడుస్తున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే వరుస ఛాన్సులు దక్కుతున్నాయి.. లేదంటే అంతే సంగతులు. ఇక పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బేకీ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో తన అందాలలో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.. విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ అందాల భామ నటించిన సినిమా పేరు ఇప్పుడు ట్రెండ్ గా మారింది. చాలా మంది సెలబ్రెటీలు ఆ డైలాగ్స్ తో షార్ట్ వీడియోలు చేస్తున్నారు.

ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ చిన్నారి ఎవరో కాదు.. ఇటీవల రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’,‘టిల్లు స్క్వేర్’ నటించిన రాధికా.. అలియాస్ నేహా శెట్టి. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘మెహబూబా’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత గల్లీ రౌడీ మూవీలో నటించినంది.. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తర్వాత జోన్నల గడ్డ సిద్దు హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ లో రాధిక పాత్రలో నటించింది. ఈ ఒక్క సినిమా నేహా శెట్టి జాతకం మొత్తం మార్చి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ టీజే టిల్లులో డైలాత్స్ యూత్ వాడుతూనే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి