iDreamPost

డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని

డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్రూం ఇళ్లు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో కూడిన ఇల్లు నిర్మించి ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశం.తద్వారా ప్రతీ ఇల్లు లేని పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ కలలు గని ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఇప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంతో మంది పేదలు డబుల్ బెడ్రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులు అందజేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఈ వార్తతో డబుల్ బెడ్రూం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్ఐసీ సంస్థ స్పెషల్ గా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆ ఆన్ లైన్ డ్రా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున మొత్తం 12 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.

ఈ ప్రక్రియ సెప్టెంబర్ 2న జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మిగతా వివరాలను అధికారులు మీ వద్దకు వచ్చి వివరిస్తారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆసీఫ్ నగర్, బహదూర్ పురా, యూసుఫ్ గూడ, బోరబండ, సైదాబాద్, బేగంబజార్, చంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కు ధన్యావాదాలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి