iDreamPost

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ప్రధాన పార్టీ నేతలు నువ్వా.. నేనా అనే విధంగా ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ప్రధాన పార్టీ నేతలు నువ్వా.. నేనా అనే విధంగా ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలుపు తమ ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ కొట్టాలనే గట్టి పట్టుమీద అధికార పార్టీ ఉంది. మరోవైపు అధికార పార్టీ గద్దె దించి తాము అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు సైతం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.  బీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెక్నికల్ సమస్య తలెత్తడంతో పైలట్లు గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. బుధవారం మెదక్ లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ ముగించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరే క్రమంలోన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించి ఆపివేశారు. అయితే సీఎం కేసీఆర్ చాపర్ లో సాంకేతిక సమస్య రావడం ఇది మూడోసారి. ముందుగానే సమస్యను పసిగట్టి పైలట్లు సమయస్ఫూర్తితో హెలికాప్టర్ ని సెఫ్ ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఈ మద్యనే మహబూబ్ నగర్ జిల్లా ఎర్రవల్లి నుంచి దేవరకద్రకు ప్రచార సభకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ టెక్నికల్ ఇబ్బంది రావడంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై  సేఫ్ ల్యాండ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో కూడా హెలికాప్టర్ మొరాయించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు నువ్వా.. నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం హాట్ టాపిక్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి