iDreamPost

పేదోళ్ల గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్: బిత్తిరి సత్తి

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.

పేదోళ్ల గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్: బిత్తిరి సత్తి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్నారు. ఎవరు ఏ క్షణంలో పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటివల కమెడియన్ బిత్తిరి సత్తి సైతం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ గురించి బిత్తిరి సత్తి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు సినిమాలపై ఇష్టంతో స్టూడియోల చుట్టూ తిరిగిన రవికుమార్ ఓ ఛానల్ ఛాన్స్ దక్కించుకున్నాడు. తన వేషం, భాష, మేనరీజం మార్చుకొని బిత్తిరి సత్తిగా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. అలా బిత్తిరి సత్తిగా బాగా పాపులారిటీ సంపాదించి తర్వాత వెండితెరపై తన సత్తా చాటాడు. ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానల్స్ లో నటిస్తూ.. సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు తీసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇటీవల ముదిరాజ్ ఆత్మగౌర సభలో బిత్తిరి సత్తి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిత్తిరి సత్తి ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మద్యనే మంత్రి కేటీఆర్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిత్తిరి సత్తి గులాబీ కండువ కప్పుకొని రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. తాజాగా బిత్తిరి సత్తి.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. పేదోళ్ల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్.

ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు తీసుకు వచ్చి తెలంగాణ అభివృద్దికోసం కృషి చేశారు. తెలంగాణ ప్రజలు ఆయనను రెండుసార్లు ఆశీర్వదించారు. దేశంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే నాయకులు వరుసగా పార్టీలు మారుతున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వేల కోట్ల ఆదాయం ఉన్నవారి గురించి కాకుండా ఐదు వేళ్లు నోట్లకి వెళ్తున్నాయా? లేదా అనే పేద ప్రజల అభ్యున్నతికోసం పాటుపడుతున్నారని బిత్తిరి సత్తి అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి