iDreamPost

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి నాపై జరిగినట్లే: సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేస్తుండగా అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు.

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేస్తుండగా అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు.

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి నాపై జరిగినట్లే: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించి ప్రజల్లో కలియ తిరుగుతున్నారు రాజకీయ నాయకులు. కాగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. గులాబీ బాస్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అయితే ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంలో అలజడి రేగింది. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారం చేస్తుండగా అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలంరేగింది. కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు.

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ నేడు (సోమవారం) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రజలతో మమేకమై ఉండగా గుంపులోంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయన గాయపడగా స్పందించిన సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. హత్యా రాజకీయాలకు పూనుకుంటున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ దుబ్బాక అభ్య‌ర్థి మీద జ‌రిగిన దాడి.. ప్ర‌భాక‌ర్ రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద దాడి జ‌రిగింద‌ని మ‌న‌వి చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌లు, వెధ‌వ‌లు ప‌ని చేసే చేత‌గాక, ఎన్నిక‌లు ఫేస్ చేసే ద‌మ్ము లేక హింస‌కు, దాడుల‌కు దిగ‌జారుతున్నారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. క‌త్తులు ప‌ట్టి మా అభ్య‌ర్థుల మీద దాడి చేస్తున్నారు. క‌త్తి ప‌ట్టుకొని పొడ‌వాలంటే ఇంత మందిమి ఉన్నాం.. మాకు చేతులు లేవా..? మొండిదో లండిదో మాకో క‌త్తి దొర‌క‌దా..? ఒక వేళ మాకు తిక్క‌నే రేగితే.. దుమ్ము దుమ్మే రేగాలి ఈ రాష్ట్రంలో. త‌స్మాత్ జాగ్ర‌త్త అని హెచ్చ‌రించారు.

ఈ ప‌దేండ్ల‌లో ఎన్నో ఎన్నిక‌లు జ‌రిగాయి.. ఎన్న‌డు మ‌నం హింస‌కు దిగ‌లేదు అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్ర‌జ‌లు గెలిపిస్తే గెలిచినం.. చేత‌నైన కాడికి ప్ర‌జ‌ల‌కు సేవ చేసినం త‌ప్ప‌.. దుర్మార్గ‌మైన ప‌నులు చేయ‌లేదు. ఇవాళ దుబ్బాక అభ్య‌ర్థి మీద జ‌రిగిన దాడి.. ప్ర‌భాక‌ర్ రెడ్డి మీద కాదు.. కేసీఆర్ మీద దాడి జ‌రిగింద‌ని మ‌న‌వి చేస్తున్నాను. ప్రజలకు సేవ చేసే పనిలో మేముంటే.. మీరు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి