iDreamPost

‘ప్రగతి ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి KTR

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఈసారి ప్రచారంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేస్తూ.. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఈసారి ప్రచారంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేస్తూ.. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు.

‘ప్రగతి ప్రస్థానం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి KTR

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అందుకే ఆయనను రెండో పర్యాయం కూడా ముఖ్యమంత్రి గా ఆశీర్వదించారు తెలంగాణ ప్రజలు. ఎన్నో ఏళ్ల పోరాటం.. ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం…ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పుస్తకాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ నేడు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయి.. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయి. ఈ పథకాల ఫలితంగానే తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు సాక్షాత్తు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ అద్భుత పనితీరును ఇలాంటి నివేదికలెన్నో తేల్చి చెప్పాయి. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంధుబి మోగించింది, 2023 లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని… ఇది నా అభిప్రాయమే కాదు.. యావత్ తెలంగాణ ప్రజల అభిప్రాయం’ అని అన్నారు.

ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా తన సంపాదకత్వంలో ‘ప్రగతి ప్రస్థానం’ పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు, సీఎం పిఆర్ఓ రమేష్ హజారీ కృషిని మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం ఒక హ్యాండ్ నోట్ గా ఉపయోగ పడుతుందని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణను సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా, తన సాహిత్య ప్రతిభతో సోషల్ మీడియాలోనూ, పాటలు, సాహిత్యం, పుస్తకాల రూపంలోనూ వెలువరించడం అభినందనీయం. ప్రభుత్వ కార్యాచరణను జనంలోకి తీసుకుపోయేలా సీనియర్ జర్నలిస్ట్ రమేష్ హజారీ పాటుపడుతున్న తీరును మంత్రి కెటిఆర్ ప్రశంసించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి