iDreamPost

విద్యార్థులకు భారీ శుభవార్త.. సెలవులు పొడిగింపు!

Good News For School Students- Summer Holidays: పాఠశాల విద్యార్థులకు భారీ శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వేసవి సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగిదే జూన్ 12న స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Good News For School Students- Summer Holidays: పాఠశాల విద్యార్థులకు భారీ శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వేసవి సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగిదే జూన్ 12న స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

విద్యార్థులకు భారీ శుభవార్త.. సెలవులు పొడిగింపు!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు తగ్గిపోయాయి. రుతు పవనాల ఆగమనంతో దేశవ్యాప్తంగా వర్షాలు మొదలైపోయాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇంక తల్లిదండ్రులు కూడా పిల్లలను స్కూల్స్ కి పంపేందుకు రెడీ అయిపోతున్నారు. కానీ, ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే అందింది. అదేంటంటే వేసవి సెలవులు పొడిగించబోతున్నారు అనే వార్త ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వార్తతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా సెలవుల సరిపోలేదు.. పొడిగిస్తే బాగుంటుంది అని ఎదురుచూస్తున్నారు. అసలు ఎందుకు సెలవులు పొడిగించాలి అనుకుంటున్నారో చూద్దాం.

2023- 24 విద్యా సంవత్సరానికి గానూ.. విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు దాదాపుగా పూర్తయ్యాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకో వారంలోగా ఆ సెలవులు పూర్తి కాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అందేలా కనిపిస్తోంది. సెలవులు పొడిగిస్తూ విద్యా శాఖ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి జూన్ 12 నుంచి 2024- 25 విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. క్యాలెండర్ ప్రకారం అయితే వచ్చే బుధవారం నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి.

అయితే ఈ జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఏఎస్ రామకృష్ణ విజ్ఞప్తితో జూన్ 12న కూడా విద్యార్థులకు సెలవు దక్కే అవకాశం ఉంది అంటున్నారు. జూన్ 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయనే అభిప్రాయులు వినిపిస్తున్నాయి. అలాగే ఒకవేళ అదికారులు ఇంకా ఏమైనా సెలవులను పొడిగించాలి అనుకుంటే విద్యార్థులకు ఇది నిజంగానే భారీ శుభవార్తే అవుతుంది. అయితే ఈ సెలవులకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరి.. సెలవులు పొడిగిస్తారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి