iDreamPost

ఎట్టకేలకు దిగొచ్చిన జ్ఞానవేల్‌ .. దర్శకుడికి క్షమాపణలు!

హీరో కార్తి నటించిన మొదటి సినిమా "పరుత్తివీరన్" విషయంలో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తోంది. అమిర్ ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ చేసిన వ్యాఖ్యలు కోలివుడ్ లో దుమారం రేపిన విషయం తెలిసిందే.

హీరో కార్తి నటించిన మొదటి సినిమా "పరుత్తివీరన్" విషయంలో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తోంది. అమిర్ ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ చేసిన వ్యాఖ్యలు కోలివుడ్ లో దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు దిగొచ్చిన జ్ఞానవేల్‌ .. దర్శకుడికి క్షమాపణలు!

గత కొన్ని రోజులుగా కోలివుడ్ లో జరుగుతున్న “పరుత్తివీరన్” వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. హీరో కార్తీ నటించిన మొదటి సినిమా “పరుత్తివీరన్” విషయంలో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అమిర్‌ను ఉద్దేశించి నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొవడం ఇప్పుడు కోలివుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. దర్శకుడు అమిర్‌కు మద్దతుగా కోలీవుడ్ దర్శక, నటులు అండగా నిలుస్తున్నారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ దిగొచ్చారు. అమిర్‌కు క్షమాపణలు చెప్పడంతో ఈ చర్చకు తెరపడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కార్తీ తాజా చిత్రం ‘జపాన్’కు జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కార్తీతో ఇప్పటి వరకు పని చేసిన దర్శకులందరినీ పిలిచారు. కానీ, తన మొదటి సినిమా పరుత్తివీరన్ దర్శకుడు అమిర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. దీనిపై అమిర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జపాన్ సినిమా ఈవెంట్‌కు తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అయితే.. అమిర్‌కు ఆహ్వానం అందకపోవడానికి కారణం జ్ఞానవేల్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

అమిర్ ‘‘ పరుత్తివీరన్’’ టైంలో.. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు తనతో ఖర్చు పెట్టించి, సరైన లెక్కలు చూపించకుండా తన దగ్గర డబ్బులు కాజేశాడని.. ఇలా పలు రకాలుగా జ్ఞానవేల్ విమర్శించాడు. ఈ బడ్జెట్ విషయంలో ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అతడు చేసిన ఆరోపణలు తప్పు అని డైరెక్టర్ శశి కుమార్, సముద్రఖని వంటి వారు ఖండించారు. తాజాగా భారతీ రాజా కూడా ఈ వివాదం మీద స్పందించి.. జ్ఞానవేల్ ను మందలించారు. ‘‘ అమిర్‌ని అగౌరవ పరిచి, కించపరిచావ్.. అతనికి క్షమాపణలు చెప్పాల్సిందే’’ అంటూ డిమాండ్ చేశాడు భారతీ రాజా. దీంతో జ్ఞానవేల్ రాజా తప్పని సరి పరిస్థితుల్లో దిగొచ్చినట్టుగా కనిపిస్తోంది.

తాజాగా జ్ఞానవేల్ రాజా వేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్టులో.. ‘‘ గత 17 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.. కానీ, ఇంత వరకు దాని గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. అమిర్‌ను నేను ఎప్పుడూ అన్నా అనే పిలుస్తుంటాను. మా ఇరు కుటుంబాలు కూడా కలిసి ఎంతో క్లోజ్‌గా ఉంటాం. నేను ఇటివలే ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడిన మాటలు ఆయన్ను బాధించినట్టుగా ఉన్నాయి. కనుక నేను మనస్పూర్తిగా అతనికి క్షమాపణలు చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు. మరి, జ్ణానవేల్‌ రాజా, అమిర్‌ల వివాదానికి తెరపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి