iDreamPost
android-app
ios-app

షారూక్ ఖాన్ స్వభావం అలా ఉండేది! నేను ఆశ్చర్యపోయా: గంభీర్

  • Published Dec 14, 2023 | 5:25 PM Updated Updated Dec 14, 2023 | 5:25 PM

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​తో గౌతం గంభీర్​కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ జట్టుతో తన అనుబంధం, కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్ స్వభావంపై గంభీర్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కోల్​కతా నైట్ రైడర్స్ టీమ్​తో గౌతం గంభీర్​కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ జట్టుతో తన అనుబంధం, కేకేఆర్ ఓనర్ షారూక్ ఖాన్ స్వభావంపై గంభీర్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Dec 14, 2023 | 5:25 PMUpdated Dec 14, 2023 | 5:25 PM
షారూక్ ఖాన్ స్వభావం అలా ఉండేది! నేను ఆశ్చర్యపోయా: గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భారీ ఫ్యాన్​బేస్ ఉన్న ఫ్రాంచైజీల్లో కోల్​కతా నైట్ రైడర్స్ ఒకటి. బాలీవుడ్ బాద్​షా షారూక్ ఖాన్ దాని యజమాని కావడం, సౌరవ్ గంగూలీ, గౌతం గంభీర్, బ్రెండన్ మెకల్లమ్ లాంటి స్టార్ ప్లేయర్లు ఆడటంతో కేకేఆర్​కు అప్పట్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా గంభీర్ తన కెప్టెన్సీ స్కిల్స్​తో టీమ్​ను సక్సెస్​ఫుల్​గా ముందుండి నడిపించాడు. అతడి సారథ్యంలోనే కోల్​కతా 2014లో రెండోసారి విజేతగా నిలిచింది. అయితే టీమ్​ను విన్నర్​గా నిలిపిన గంభీర్ ఒక దశలో బెంచ్​కే పరిమితం కావాలని భావించాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడే స్వయంగా వెల్లడించాడు. ఇదే విషయం మీద ఫ్రాంచైజీ ఓనర్ షారూక్ ఖాన్​తో కూడా చర్చించానని తెలిపాడు. కానీ అందుకు షారుక్ అస్సలు ఒప్పుకోలేదని గంభీర్ అన్నాడు.

ప్లేయింగ్ ఎలెవన్​లో తాను ఆడనని, బెంచ్​కే పరిమితం అవుతానంటే షారూక్ ఒప్పుకోలేదని గంభీర్ చెప్పాడు. ఇదంతా 2014 ఐపీఎల్ సీజన్​లో జరిగిందని.. ఆ ఏడాది కేకేఆర్ రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోయిందని గుర్తుచేశాడు. రన్స్ చేసేందుకు ఇబ్బంది పడుతున్న టైమ్​లో కింగ్ ఖాన్ తనకు సపోర్ట్​గా నిలిచాడని గౌతీ చెప్పాడు. అతడి మద్దతు వల్లే తర్వాత పుంజుకొని ఆడానని పేర్కొన్నాడు. ఆ సీజన్​లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఫెయిలైన గంభీర్.. ఆ తర్వాత స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చాడు. టోర్నీ మొత్తంలో కలిపి 335 రన్స్ చేశాడు. కోల్​కతా నైట్ రైడర్స్ తరఫున అత్యధిక రన్స్ చేసిన మూడో బ్యాటర్ అతడే కావడం విశేషం. లీగ్​ స్టేజ్​లో మొదటి 7 మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన కేకేఆర్.. అనంతరం వరుసగా విక్టరీలు కొడుతూ టైటిల్​ను గెలుచుకుంది. ఆ సీజన్ ఫైనల్​లో పంజాబ్ కింగ్స్​ను 3 వికెట్ల తేడాతో ఓడించింది కేకేఆర్. ఆ టైమ్​లో టీమ్ ఓనర్ షారూక్​తో జరిగిన పలు విషయాలను మరోమారు నెమరు వేసుకున్నాడు గంభీర్.

‘దుబాయ్ వేదికగా జరిగిన ఆ ఎడిషన్​లో వరుసగా మూడు మ్యాచుల్లో నేను డకౌట్​గా వెనుదిరిగా. నాలుగో మ్యాచ్​లో ఒక్క రన్ మాత్రమే చేశా. మొదటి ఐదు మ్యాచుల్లో మేం నాలుగింట్లో ఓడాం. అయితే ఆ తర్వాత సీజన్​లోని మిగతా మ్యాచుల్ని భారత్​లో నిర్వహించారు. ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్​లో ఓటమిని చవిచూశాం. ఆ టైమ్​లో షారూక్ నా దగ్గరకు వచ్చాడు. పక్కకు తీసుకెళ్లి టీమ్ సిచ్యువేషన్ ఏంటని అడిగాడు. నేను టీమ్ నుంచి వైదొలగాలని అనుకుంటున్నానని చెప్పా. దీనికి షారూక్ ఒప్పుకోలేదు. నచ్చినంత కాలం కంటిన్యూ అవ్వమని చెప్పాడు. కానీ వైదొలుగుతానని చెప్పొద్దని కోరాడు. ప్రతి మ్యాచ్​లో ఆడాలని నాతో ఒట్టు వేయించుకున్నాడు. అనంతరం వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదా. ఆ సీజన్​లో రెండోసారి కప్ గెలిచాం. టీమ్​తో ఉన్న ఏడేళ్లలో షారుక్​తో క్రికెట్ సంబంధింత అంశం మీద చర్చించిన ఘటన అదొక్కటే అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. షారూక్ స్వభావం అలా ఉండేది. ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. మరి.. షారూక్​తో గంభీర్ ఒట్టు వేయించుకోవడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: David Warner Six: డేవిడ్ భాయ్ అన్​ బిలీవబుల్ షాట్.. అలా ఎలా కొట్టావ్ సామీ!