iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ‘గబ్బర్ సింగ్’ సింగర్ మృతి

Vaddepalli Srinivas Passed away: టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vaddepalli Srinivas Passed away: టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ‘గబ్బర్ సింగ్’ సింగర్ మృతి

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము అభిమానించే నటీనటులు, దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు… వారిని ఎంతగానో అబిమానించే అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్ యాక్సిడెంట్స్, హార్ట్ ఎటాక్ ఇలా పలు కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన సెన్సేషన్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ సింగర్ కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ఇటీవల పలువురు సెలబ్రెటీలు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ జానపద సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని తన ఇంట్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నో జానపద పాటలు పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్ అప్పట్లో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా’ అనే పాటతో బాగా పాపులర్ అయ్యారు. ఆ పాట ఆయనకు ఫిలిమ్ ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. అక్కినేని నాగార్జున నటించిన కింగ్ మూవీలో ‘ఎంత పని చేస్తివిరో’ అనే పాట కూడా మంచి పేరు సంపాదించింది.

వడ్డేపల్లి శ్రీనివాస్  కెరీర్ లో దాదాపు వందకు పైగా సాంగ్స్, ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ పాడారు. చిన్నప్పటి నుంచి జానపద పాటలతో ఎంతోమందిని అలరిస్తూ వచ్చారు. చాలా వరకు సాంగ్స్ ఆయన సొంతంగానే కంపోజ్ చేస్తుంటారని టాక్. ఆయన కెరీర్ లో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు. గబ్బర్ సింగ్ లో పాట పాడిన తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు కూడా వచ్చాయి.

ఆయన మృతి పట్ల సినీ, జానపద కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యలకు సానుభూతి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి