iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్!.. వెంటనే అప్లై చేసుకోండి

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

నిరుద్యోగులకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్!.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. పోస్టులు వందల్లో ఉంటే.. పోటీ పడే అభ్యర్థుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం కాస్త కష్టమైన పనే. కానీ ఖచ్చితమైన ప్రణాళిక, దానికి తగిన కృషి చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. త్వరలో తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ సంస్థ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పాటు ప్రిపరేషన్ ప్లానింగ్ కూడా ఉండాలి. దానికి తగిన శిక్షణ తీసుకోవాలి. అయితే నిరుద్యోగులు కోచింగ్ కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. దీని వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతుంటారు. కాగా కొంత మంది పేదవారికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే స్థోమత ఉండదు. అలాంటి వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనుంది.

గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 12 టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్లలో అందించనున్నారు. 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫ్రీ కోచింగ్ అందించనున్నట్లు టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 2024 జనవరి 8 నుంచి 20 వరకు www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విధానం రిజర్వేషన్, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం 040-24071178 & 040-27077929 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. మరి టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్ కు ఫ్రీ కోచింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.