iDreamPost

IPL 2024: MI కెప్టెన్సీ.. సచిన్ కంటే రోహిత్ గొప్పవాడా? మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గొడవలపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్. సచిన్ కంటే రోహిత్ గొప్పవాడా? అంటూ ఘాటుగా స్పందించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గొడవలపై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్. సచిన్ కంటే రోహిత్ గొప్పవాడా? అంటూ ఘాటుగా స్పందించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

IPL 2024: MI కెప్టెన్సీ.. సచిన్ కంటే రోహిత్ గొప్పవాడా? మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

ముంబై ఇండియన్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో ఆటకంటే ఎక్కువగా ఇతర విషయాల ద్వారానే వార్తల్లో నిలుస్తూ వస్తోంది. టోర్నీ ప్రారంభానికంటే ముందు నుంచే ఎంఐ టీమ్ న్యూస్ లో హాట్ టాపిక్ నిలిచింది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది ముంబై యాజమాన్యం. ఇక అప్పటి నుంచి మెుదలైంది ముంబైపై విమర్శల పర్వం. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో.. వచ్చే సీజన్ కు ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నాడన్న వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. రోహిత్ తో పాటుగా బుమ్రా, సూర్యకుమార్ మరికొందరు ప్లేయర్లు కూడా ఇదే బాటలో నడుస్తారని టాక్. ఇలాంటి సమయంలో హార్దిక్ కెప్టెన్సీలో ఆడటంలో రోహిత్ కు ఉన్న ప్రాబ్లమ్ ఏంటని ప్రశ్నిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్. ఈ విషయంపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు ఈ మాజీ స్పీడ్ స్టర్. శ్రీశాంత్ మాట్లాడుతూ..

Sachin vs Rohith

“క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కరే ధోని సారథ్యంలో ఆడాడు. రోహిత్ అతని కంటే గొప్పా? ధోని కెప్టెన్సీలో ఆడి వరల్డ్ కప్ కూడా గెలిచాం. అలాంటిది హార్దిక్ పాండ్యా సారథ్యంలో రోహిత్ ఆడటానికి ఇబ్బంది ఏంటి? ఈ విషయంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇవేవీ రోహిత్ పట్టించుకోడని నా అభిప్రాయం. ప్రస్తుతం రోహిత్ చాలా స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఈ ఫ్రీడమ్ కారణంగా ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా నిలిచే ఛాన్స్ ఉంది. గతంలో హిట్ మ్యాన్ ముంబైని ముందుండి నడిపించాడు. ఇప్పుడు వెనక ఉండి నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను” అని చెప్పుకొచ్చాడు శ్రీశాంత్. ప్రస్తుతం శ్రీశాంత్ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి