iDreamPost

వీడియో: క్లాసెన్‌ వర్సెస్‌ జడేజా! ఎవరు పైచేయి సాధిస్తారు?

  • Published Apr 05, 2024 | 1:42 PMUpdated Apr 05, 2024 | 1:42 PM

Ravindra Jadeja, Heinrich Klaasen, IPL 2024: హైదరాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అంతా జడేజా వర్సెస్‌ క్లాసెన్‌ ఫైట్‌ గురించే ఎదురుచూస్తున్నారు.

Ravindra Jadeja, Heinrich Klaasen, IPL 2024: హైదరాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో అంతా జడేజా వర్సెస్‌ క్లాసెన్‌ ఫైట్‌ గురించే ఎదురుచూస్తున్నారు.

  • Published Apr 05, 2024 | 1:42 PMUpdated Apr 05, 2024 | 1:42 PM
వీడియో: క్లాసెన్‌ వర్సెస్‌ జడేజా! ఎవరు పైచేయి సాధిస్తారు?

ఐపీఎల్‌ 2024లో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ సీఎస్‌కే. ఈ సీజన్‌లో మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ అద్భుతంగా రాణిస్తుండటం, అలాగే హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో చాలా మంది ధోని ఆట చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధోని ప్రత్యర్థి టీమ్‌లో ఉన్నా.. జట్లకు అతీతంగా అతన్ని అభిమానిస్తారు. అందుకే హోం టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ను సపోర్ట్‌ చేస్తూ.. ధోని కూడా రాణించాలని చాలా మంది తెలుగు ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో అసలైన ఫైట్‌ మాత్రం హెన్రిచ్‌ క్లాసెన్‌, రవీంద్ర జడేజా మధ్యే ఉంటుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అందుకు ఓ పెద్ద కారణం కూడా ఉంది.

క్లాసెన్‌ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఎదురుగా ఏ బౌలర్‌ ఉన్నా.. కాస్త కూడా కనీకరం లేకుండా ఫోర్లు సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌పై ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరు చూశారు. ఇప్పుడు మ్యాచ్‌ ఏకంగా హోం గ్రౌండ్‌లో కావడంతో క్లాసెన్‌ను అడ్డుకోవడం సీఎస్‌కేకు పెద్ద సవాలే. అలాగే మరో వైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జేడజా కూడా బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. దీంతో.. వీరిద్దరి మధ్య టఫ్‌ ఫైట్‌ ఉండబోతుందని అనుకోవచ్చు.. కానీ, విషయం అది కాదు. వీరిద్దరి మధ్య పాత గొడవ ఒకటుంది. అదే ఇప్పుడు ఈ మ్యాచ్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చింది.

Klaasen vs Jadeja!

ఐపీఎల్‌ 2023 సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. జడేజా ఓ క్యాచ్‌ అందుకోబోతుంటే.. దానికి క్లాసెన్‌ అడ్డువచ్చాడు. అతను ఉద్దేశపూర్వకంగా అడ్డురాకపోయినా.. అక్కడ క్యాచ్‌ మాత్రం జడేజా మిస్‌ అయ్యాడు. దీంతో.. జడేజా క్లాసెన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాచ్‌ పడుతుంటే ఎందుకు అడ్డువచ్చావంటూ మండిపడ్డాడు. అదే మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య వాడివేడి రాజుకుంది. కోపంగా చూసుకోవడం, జడేజా వాట్‌ అంటూ క్లాసెన్‌ను అడగడం అంతా ఓ చిన్నపాటి గొడవలా సాగింది. ఇది జరిగి ఏడాది అయినా.. ఇప్పుడు ఈ రెండు టీమ్స్‌ మధ్య మ్యాచ్‌తో.. పాత వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారో అంటూ ఫ్యాన్స్‌ కూడా ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి