iDreamPost

CM జగన్ సమక్షంలో YSRCP లోకి చేరిన మాజీ మంత్రి!

YSRCP: టీడీపీ రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే టీడీపీపై సూర్యారావు సంచలన వ్యాఖ్యాలు చేశారు.

YSRCP: టీడీపీ రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే టీడీపీపై సూర్యారావు సంచలన వ్యాఖ్యాలు చేశారు.

CM జగన్ సమక్షంలో YSRCP లోకి చేరిన మాజీ మంత్రి!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలకు మాత్రం దెబ్బ మీద  దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గెలుపు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు పొత్తులు పెట్టుకుని మరీ..ఏదో చిన్న ఆశతో ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో సొంత పార్టీకి చెందిన వారే.. ఆయనకు షాకిస్తున్నారు. వరుసపెట్టి రాజీనామాలు చేస్తూ ఆ పార్టీని కోలుకోలేనేది విధంగా మార్చేస్తున్నారు. అయితే  టీడీపీలో ఎన్నో అవమానాలు పడే.. రాజీనామా నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఆ పార్టీని వీడిన నేతలు చెబుతున్నారు. అలా  బాబు అవమానించిన వారిని సీఎం జగన్ అక్కున చేర్చుకుంటున్నారు.

టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఆ పార్టీని వీడిన ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సూర్యారావు  వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. ఎంతోకాలం నుంచి పార్టీలో కష్టపడి పని చేస్తూ రాజోలు నియోకవర్గంలో పార్టీ బలపేతానికి కృషి చేస్తే..తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి సూర్యారావుతో పాటు పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరి చేరిక కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్.. ఎంపీ మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని  నాని పాల్గొన్నారు. గొల్లపల్లి  సూర్యారావు 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా  గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైఎస్సార్ కేబినెట్ లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా  పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచారు. అయితే 2019లో జనసేన అభ్యర్థికగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌ చేతిలో ఓడారు. అయినప్పటికీ అప్పటి నుంచి కూడా నియోజగవర్గంలో టీడీపీ బలోపేతానికి సూర్యారావు కృషి చేశారు.

ఈక్రమంలోనే తాజాగా ఆయనకు రాజోల్ టికెట్ ను టీడీపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీలో నిబద్ధతతో పని చేసిన తనని మెడబట్టుకుని గెంటేశారని మీడియా ముందు ఆయన వాపోయారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లు చూశారని, అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారని ఆయన తెలిపారు. లోకేష్‌ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడని సూర్యారావు ఉన్నారు.

టీడీపీ అవమానించిన బాధలో ఉన్న తనను సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారని అన్నారు. చంద్రబాబు తనను మెడపట్టుకుని బయటకు గెంటారని, జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కోసం శాయశక్తుల పని చేస్తానని సూర్యారావు చెప్పారు. పొత్తులో భాగంగా.. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తన రాజీనామాకు కారణంగా వెల్లడించారు. ఆ వెంటనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లిన ఆయన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, కేశినేని నానిలు వెంటపెట్టుకుని సీఎం జగన్‌ చెంతకు తీసుకెళ్లారు. మొత్తంగా బాబు అవమానిస్తే.. అక్కున చేర్చుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి