iDreamPost

వీడియో: PSL లో మరో గొడవ.. ఈసారి పాక్ ప్లేయర్ vs ఇంగ్లండ్ ప్లేయర్!

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో గొడవలు ఆగడం లేదు. ఒక గొడవను మర్చిపోకముందే.. మరోకటి జరుగుతోంది. తాజాగా పాక్ ప్లేయర్, ఇంగ్లండ్ ప్లేయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో గొడవలు ఆగడం లేదు. ఒక గొడవను మర్చిపోకముందే.. మరోకటి జరుగుతోంది. తాజాగా పాక్ ప్లేయర్, ఇంగ్లండ్ ప్లేయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

వీడియో: PSL లో మరో గొడవ.. ఈసారి పాక్ ప్లేయర్ vs ఇంగ్లండ్ ప్లేయర్!

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్లేయర్లు ఆట కంటే ఎక్కవగా గొడవలతో న్యూస్ లో వినిపిస్తున్నారు. మెున్నటికి మెున్న షాన్ మసూద్ వర్సెస్ షాదాబ్ ఖాన్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవను మర్చిపోకముందే.. పీఎస్ఎల్ లో మరో ఫైట్ జరిగింది. అయితే ఈసారి గొడవపడ్డ వారిలో ఒక్కరే పాక్ ప్లేయర్. ఇంకో ఆటాగాడు ఇంగ్లండ్ టీమ్ కు చెందిన వాడు. ఇంతకీ అసలు గొడవేంటి అంటే?

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా మంగళవారం(మార్చి 12) ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్ అహ్మద్ కు క్వెట్టా గ్లాడియేటర్స్ కు ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్ జేసన్ రాయ్ కు మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన క్వెట్టా టీమ్ బ్యాటింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 2.2 ఓవర్ దగ్గర చోటుచేసుకుంది. ఈ ఓవర్లలో ముల్తాన్ బౌలర్ విల్లే విసిరిన బంతికి జేసన్ రాయ్ ఎల్బీగా వెనుదిరిగాడు.

దీంతో పెవిలియన్ కు వెళ్తు తన కాలిని గాల్లోకి తన్నాడు జేసన్ రాయ్. అదే టైమ్ లో ఇఫ్తికర్ ఎదురుగా ఉన్నాడు. దీంతో అతడు ఏదో అనగా.. జేసన్ రాయ్ కోపంగా అతడివైపు దూసుకెళ్లాడు. మధ్యలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ వచ్చి రాయ్ ను వెనక్కి తీసుకెళ్లగా అంపైర్లతో పాటుగా ఇతర ఆటగాళ్లు వచ్చి ఇద్దరికి సర్ధిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. 7 బంతుల్లో 3 రన్స్ చేసి జేసన్ రాయ్ పెవిలియన్ చేరాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టీమ్ లో రిజ్వాన్(69), చార్లెస్(53) అర్దసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత 186 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన క్వెట్టా టీమ్ డేవిడ్ విల్లే, ఉసామా మీర్ ధాటికి 15.5 ఓవర్లకే 106 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో 79 పరుగుల తేడాతో ముల్తాన్స్ జట్టు విజయం సాధించింది. ఇక ఈ గొడవ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పీఎస్ఎల్ లీగ్ అంటే ఫైటింగ్ సూపర్ లీగ్ అని పేరు మార్చాలేమో?, మీరు మారరా? రోజూ ఇదే పనా? అంటూ కామెంట్స్ లో రాసుకొస్తున్నారు.

ఇదికూడా చదవండి: క్యాటరింగ్ బాయ్ టు క్రికెటర్.. సిరాజ్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన BCCI!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి