iDreamPost

క్యాటరింగ్ బాయ్ టు క్రికెటర్.. సిరాజ్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన BCCI!

టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ తాజాగా తన బర్త్ డేను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీసీసీఐ. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి.

టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ తాజాగా తన బర్త్ డేను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీసీసీఐ. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి.

క్యాటరింగ్ బాయ్ టు క్రికెటర్.. సిరాజ్ బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన BCCI!

ఆ కుర్రాడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే పిచ్చి. కానీ తన కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. తన డ్రీమ్ ను పక్కనపెట్టి కూలీగా మారాడు. ఫ్యామిలీ అవసరాల కోసం క్యాటరింగ్ బాయ్ గా మారాడు. అయితే క్రికెటర్ కావాలన్న తన కల మాత్రం అతడిని వెంటాడుతూనే ఉంది. దీంతో ఓ వైపు కుటుంబానికి సాయం చేస్తూనే.. క్రికెట్ పాఠాలు నేర్చుకునేవాడు. అలా పడ్డ కష్టం వృథా కాలేదు. ఇప్పుడు ఆ కుర్రాడు టీమిండియా స్టార్ బౌలర్ గా ఎదిగాడు. అతడే హైదరాబాదీ స్పీడ్ స్టర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్. ఈ రోజు(మార్చి 13) సిరాజ్ బర్త్ డే కావడంతో.. అతడి జీవితానికి సంబంధించిన విశేషాలతో కూడిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది బీసీసీఐ.

మహ్మద్ సిరాజ్.. 1994 మార్చి 13న హైదరాబాద్ లో జన్మించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సిరాజ్, చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. తండ్రి సంపాదనతో నడుస్తున్న తన ఫ్యామిలీకి అండగా నిలబడాలని భావించి.. చిన్న వయసులోనే క్యాటరింగ్ బాయ్ గా అవతారం ఎత్తాడు. అప్పట్లో రోజుకు 100 నుంచి 150 రూపాయాలు వచ్చేవి. అందులో 50 రూపాయలు సిరాజ్ ఉంచుకుని మిగతావి ఇంట్లో ఇచ్చేవాడు. ఇక క్రికెటర్ కావాలనుకున్న తన కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. తన లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ మర్చిపోలేదు.

Catering boy to cricketer 2

స్థానికంగా ఉండే ఈద్గా గ్రౌండ్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు సిరాజ్. డబ్బులు లేక ఎక్కడా కోచింగ్ కూడా తీసుకోలేదు. క్రమంగా HCA ఎ-డివిజన్ లీగ్ లో సత్తాచాటాడు. తన పదునైన పేస్, స్వింగ్ తో ఈ లీగ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్లాడు. ఇతడి బౌలింగ్ ను చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం 2017 ఐపీఎల్ సీజన్ కు రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయం అప్పట్లో ఓ సంచలనం. ఈ సీజన్ లో 6 మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీశాడు. ఆ వెంటనే టీమిండియా నుంచి పిలుపొచ్చింది. ఇక అక్కడి నుంచి సిరాజ్ ప్రయాణం మనకు తెలియనిది కాదు.

సిరాజ్ కెరీర్ లో ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల అద్భుత ప్రదర్శన మర్చిపోలేనిది. ఈ క్రమంలోనే మార్చి 13తో 30వ పడిలోకి అడుగుపెడుతున్న సిరాజ్ పై ఓ స్పెషల్ వీడియోను చేసింది బీసీసీఐ. ఆ వీడియోలో సిరాజ్ తన చిన్నతనంలో చేసిన కూలీ పనులు, తాను గల్లీల్లో తిరిగి చాయ్ తాగిన ప్లేసులు, ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్ విషయాలతో పాటుగా తన కుటుంబ పరిస్థితుల గురించి వివరించాడు. ఇలా వివరిస్తున్న క్రమంలో భావోద్వేగానికి లోనైయ్యాడు సిరాజ్. అతడి కెరీర్ విషయానికి వస్తే.. 27 టెస్టుల్లో 74 వికెట్లు, 41 వన్డేల్లో 68, 10 టీ20ల్లో 12, 79 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 78 వికెట్లను పడగొట్టాడు. కష్టాల కడలిని ఈది స్టార్ క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని పుట్టినరోజు జరుపుకుంటున్న సిరాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సహచర ఆటగాళ్లు, అభిమానులు. మరి ఈ సందర్భంగా సిరాజ్ పై బీసీసీఐ విడుదల చేసిన స్పెషల్ వీడియోను మీరు చూసేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ గొప్పతనం అప్పుడు తెలిసింది.. ఆ రోజు ఏం చేశాడంటే?: అశ్విన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి