iDreamPost

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CM కేజ్రీవాల్ అరెస్ట్

CM Kejriwal Arested By ED: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు.

CM Kejriwal Arested By ED: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CM కేజ్రీవాల్ అరెస్ట్

ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ కవితను సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయనకు 9 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ వచ్చారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోరారు. కానీ, ఢిల్లీ హైకోర్టు మాత్రం ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమంటూ తేల్చేసింది. ఆ తీర్పు వెలువడిన తర్వాత కాసేపటికే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 3 గంటలపాటు నడిచిన నాటకీయ పరిణామాలకు తెరపడింది. సీఎం కేజ్రీవాల్ ను రెండు గంటలపాటు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు సతీమణికి సమాచారం అందించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు 9 సార్లు నోటీసులు పంపారు. కానీ ఆయన ఏ ఒక్కసారి కూడా ఈడీ అధికారుల విచారణకు హాజరు కాలేదు. ఆయన ఇన్నిసార్లు విచారణకు గైర్హాజరు అయ్యారు కాబట్టే ఆయన పాత్రపై అనుమానం మరింత బలపడింది అంటున్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియాని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవితను సైతం ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆవిడ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేయడంతో ఈ కేసులో అరెస్టుల పర్వం ముగిసింది అంటున్నారు.

సీఎంని అరెస్టు చేయచ్చా?:

అయితే ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అసలు చేయచ్చా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అక్రమాలు చేసే వాళ్లు ఎవరినైనా అరెస్టు చేస్తారు. అయితే గవర్నర్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ జనరల్ కు లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేయబోతున్న విషయాన్ని సమాచారం అందించారు అంటున్నారు. అయితే ఢిల్లీ సీఎం సీటులో ఎవరు ఉంటారు? కేజ్రీవాల్ జైలు నుంచి పాలిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దాదాపుగా కేజ్రీవాల్ రాజీనామా చేసే ఆస్కారం ఉంది అంటున్నారు. అతని స్థానంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణంస్వీకారం చేస్తారని చెబుతున్నారు. మరి కొద్దిసేపటిలో కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ ని అరెస్టు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి