iDreamPost

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టైంది వీళ్లే!

list Of Who Got Arrested In Delhi Liqour Scam: రెండు సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇప్పటివరకు ఈ కేసులో ఎవరు అరెస్టు అయ్యారో చూడండి.

list Of Who Got Arrested In Delhi Liqour Scam: రెండు సంవత్సరాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇప్పటివరకు ఈ కేసులో ఎవరు అరెస్టు అయ్యారో చూడండి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్టైంది వీళ్లే!

గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ వేగవంతం చేయడం మాత్రమే కాకుండా.. ఒక్కొక్కరిని అరెస్టు చేసుకుంటూ వచ్చారు. ఈ స్కామ్ లో ఇప్పటివరకు చాలానే అరెస్టులు జరిగాయి. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. మొదట అందరూ ఈ కేసు రూ.100 కోట్ల స్కామ్ అనుకున్నారు. కానీ, ఈ కేసు మొత్తం రూ.600 కోట్ల స్కామ్ అంటూ చెప్తున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఈ కేసు స్వరూపమే మారిపోయింది. అందరూ ఈ కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అంటున్నారు. ఆయన్ని 10 రోజుల కస్టడీకి కోరగా.. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో ఇంక అరెస్టులు ఏమీ జరగవు అంటున్నారు. కుంభకోణానికి సంబంధించి అందరినీ అరెస్టు చేసినట్లే అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అరెస్టు చేసిన ప్రతి ఒక్కరి పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో మొదలైన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోనే కాకుండా.. పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ నిరసనలు చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు వారిని అదుపుచేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలామంది అప్పుడొక పేరు, అప్పుడొక పేరు విని ఉంటారు. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి మొత్తం 16 మంది అరెస్టు అయ్యారు. ఆ 16 మంది ఎవరు? ఎప్పుడు అరెస్టు అయ్యారో చూద్దాం.

ఎవరెవరు అరెస్టు అయ్యారు:

  1. సత్యేందర్ జైన్, ఢిల్లీ మాజీ మంత్రి (మే, 2022)
  2. సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్ సంస్థ యజమాని (28/9/2022).
  3. పి. శరత్ చంద్రారెడ్డి, అరబిందో గ్రూప్ డైరెక్టర్ (11/11/2022).
  4. బినొయ్ బాబు, ఫెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ (11/11/2022).
  5. అభిషేక్ బోయినపల్లి, హైదరాబాద్ వ్యాపారి (13/11/2022).
  6. విజయ్ నాయర్, ఆప్ మీడియా ఇన్ ఛార్జ్ (13/11/2022).
  7. అమిల్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ (29/11/2022).
  8. గౌతమ్ మల్హోత్రా, మద్యం వ్యాపారి (08/02/2023).
  9. రాజేష్ జోషి, ఛారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (09/02/2023).
  10. మాగుంట రాఘవ, మద్యం వ్యాపారి (11/02/2023).
  11. అమన్ దీప్ ధల్, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ (02/02/2023).
  12. అరుణ్ పిళ్లై, మద్యం వ్యాపారి (07/03/2023).
  13. మనీష్ సిసోడియా, మాజీ ఉప ముఖ్యమంత్రి (26/02/2023).
  14. సంజయ్ సింగ్, ఆప్ రాజ్యసభ ఎంపీ (04/10/2023).
  15. కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (15/03/2024).
  16. కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి (21/03/2024).

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి