iDreamPost

కవితకు బెయిల్ దక్కనిచ్చేలా లేని భానుప్రియా మీనా.. ఈమె ఎవరంటే?

Kavitha Bail- BhanuPriya Meena: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ బెయిల్ ప్రయత్నాలకు భానుప్రియా మీనా అడ్డు పడుతున్నారు.

Kavitha Bail- BhanuPriya Meena: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ బెయిల్ ప్రయత్నాలకు భానుప్రియా మీనా అడ్డు పడుతున్నారు.

కవితకు బెయిల్ దక్కనిచ్చేలా లేని భానుప్రియా మీనా.. ఈమె ఎవరంటే?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అందరికీ తెలిసిందే. ఈ కేసులో మొత్తం 16 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని సైతం ఈ కేసులో అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆవిడ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే కవిత బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలను నీరు గార్చేందుకు ఈడీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడి పరీక్షల కోసమని మధ్యంతర బెయిల్ కోసం కవిత చేస్తున్న ప్రయత్నాలకు ఈడీ అధికారులు అడ్డు పడుతున్నారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతుందనే అభిప్రాయంతో.. మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కావాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కవిత బెయిల్ ప్రయత్నాలకు అడుగడుగునా ఈడీ అధికారులు గండి కొడుతున్నారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ వాదనలు వినిపిస్తున్నారు. కవిత బెయిల్ వ్యవహారంలో ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆవిడే భానుప్రియా మీనా. ఈవిడ మరెవరో కాదు.. ఈడీ జాయింట్ డైరెక్టర్. కవితకు బెయిల్ రాకుండా చేసేందుకు స్వయంగా భానూప్రియా మీనా కొన్ని సాక్షాలను జడ్జి ముందు ఉంచారు. అలాగే వాదనలు కూడా వినిపిస్తున్నారు. కవిత చెప్పిన కారణాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో లేదో తెలీదు. కానీ, భానూప్రియా మీనా మాత్రం బలంగా వాదనలు వినిపిస్తున్నారు.

kavitha

లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి అని.. ఆధారాలు ధ్వంసం చేసిన వ్యక్తి బెయిల్ ఇవ్వకూడదు అంటూ వాదిస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు కూడా సమర్పించారని చెబుతున్నారు. అప్రూవర్ గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ బెదిరించారంటూ ఆరోపణలు చేశారు. అలాగే కవిత కుమారుడి వయసు చిన్నదేమీ కాదన్నారు. 19 ఏళ్ల తన కుమారుడికి ఇప్పటికే కొన్ని పరీక్షలు కూడా ముగిశాయంటూ చెప్పుకొచ్చారు. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ కూడా ఏమీ లేదంటూ వాదించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేవన్నారు. అరెస్టైన తన తల్లిని చూసి కుమారుడు స్పెయిన్ వెళ్లాడంటూ తెలిపారు. అయితే కవిత తమ కుటుంబ వ్యాపార వివరాలు, ఐటీఆర్ డీటెయిల్స్, వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కవిత బెయిల్ వ్యవహారంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ భానూప్రియా మీనా ప్రధానంగా అడ్డుపడుతున్నారంటూ చెప్తున్నారు. కవిత అరెస్టు సమయంలో కేటీఆర్ కి భానుప్రియా మీనాకి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి