iDreamPost

MLC Kavitha: తీహార్ జైలుకు కవిత! ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్

  • Published Mar 26, 2024 | 1:27 PMUpdated Mar 26, 2024 | 1:41 PM

MLC Kavitha, Delhi Liquor Case, Tihar Jail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను రౌస్‌ అవెన్యూ కోర్టు తీహార్‌ జైలుకు పంపింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

MLC Kavitha, Delhi Liquor Case, Tihar Jail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను రౌస్‌ అవెన్యూ కోర్టు తీహార్‌ జైలుకు పంపింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 26, 2024 | 1:27 PMUpdated Mar 26, 2024 | 1:41 PM
MLC Kavitha: తీహార్ జైలుకు కవిత! ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్‌ నేత, కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే కేసులో అరెస్ట్‌ అయ్యారు. అయితే.. ఈ కేసులో కవిత ఈడీ కస్టడి మంగళవారంతో ముగిసింది. దీంతో కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. బెయిల్ పిటీషన్‌తో పాటు ఈడీ కస్టడీ పిటీషన్లపై వాదనలు కొనసాగాయి. కవితను 15 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది ఈడీ. ఇప్పటికే 10 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న కవితను.. కీలక అంశాలపై ఆరా తీశామని అధికారులు కోర్టుకు తెలిపారు. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు.. 14 రోజులపాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలిస్తున్నారు.

అయితే.. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. కోర్టులో జరిగిన వాదనలో.. కవితని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నామని.. కొందరితో ఫేస్‌ టూ ఫేస్‌ కూర్చోని ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది. కవితకు జరిపిన వైద్య పరీక్షల నివేదికలు ఆమెకు కూడా అందజేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కవిత బెయిల్ పిటిషన్‌పై రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. వాదనల అనంతరం, కవిత అభ్యర్థనపై ఆర్డర్ రిజర్వ్ చేశారు. మధ్యంతర బెయిల్‌పై తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఈడీ కోర్టును కోరింది.

కడిగిన ముత్యంలా బయటికి వస్తా..
కాగా, కవిత కోర్టుకు హాజరవుతున్న క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ ప్రకటించారు. తాను అప్రూవర్ గా మారనని స్పష్టం చేశారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ పేర్కొన్నారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.. నేను క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవర్‌గా మారను అంటూ కవిత మీడియాకు వెల్లడించాడు. మరి కవిత్‌ అరెస్ట్‌, అలాగే రిమాండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి