iDreamPost
android-app
ios-app

సాధారణ రైల్వే ప్రయాణికులకు ఊరట.. ఇకపై రైళ్లలో నాలుగు జనరల్ కోచ్‌లు పెంపు

  • Published Jun 24, 2024 | 1:43 PM Updated Updated Jun 24, 2024 | 1:43 PM

ఇటీవల కాలంలో సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా రైళ్లకు జనరల్ కోచ్ లు తగ్గించేయడంతో.. సాధారణ ప్రయాణికులకు ప్రయాణం చాలా ఇబ్బందిగా.. అసౌకర్యంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యలనే దృష్టిలో పెట్టుకున్న ప్రయాణికులు తాజాగా రైల్వే ప్రయాణికులకు ఊరటనిస్తూ ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించారు.

ఇటీవల కాలంలో సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా రైళ్లకు జనరల్ కోచ్ లు తగ్గించేయడంతో.. సాధారణ ప్రయాణికులకు ప్రయాణం చాలా ఇబ్బందిగా.. అసౌకర్యంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యలనే దృష్టిలో పెట్టుకున్న ప్రయాణికులు తాజాగా రైల్వే ప్రయాణికులకు ఊరటనిస్తూ ఓ గుడ్ న్యూస్ ను ప్రకటించారు.

  • Published Jun 24, 2024 | 1:43 PMUpdated Jun 24, 2024 | 1:43 PM
సాధారణ రైల్వే ప్రయాణికులకు ఊరట.. ఇకపై రైళ్లలో నాలుగు జనరల్ కోచ్‌లు పెంపు

దేశంలో అతి పెద్ద రవాణ వ్యవస్థలో ఇండియన్ రైల్వే కూడా ఒకటి. కాగా, ఇక్కడ ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు ఈ రైల్వే సర్వీస్ ను వినియోగిస్తూ తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఎందుకంటే.. ఇక్కడ ఇతర రవాణా వ్యవస్థల కన్నా ఈ రైలు ప్రయాణం తొందరగా తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చుతుంది. పైగా ఈ రైలు ప్రయాణానికి బస్సులు, ఆటోలు టికెట్ ఛార్జ్ లతో పోలిస్తే.. వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే  ఎక్కువ శాతం మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణం పైనే ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా.. ఈ రైలు ప్రయాణం చాలామందికి సౌకర్యవంతగా కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే దూర ప్రాంతాలకు వెళ్లవలసిన వారు కూడా ఈ రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. కానీ, ఇటీవల కాలంలో సాధారణ ప్రయాణికులకు రైలు ప్రయాణం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా రైళ్లకు జనరల్ కోచ్ లు తగ్గించేయడంతో.. సాధారణ ప్రయాణికులకు ప్రయాణం చాలా ఇబ్బందిగా.. అసౌకర్యంగా మారింది.

దీంతో పాటు ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడం, కోచ్ ల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో అయితే.. జనరల్ కోచ్ ల సంఖ్య ఎక్కువగా లేకపోవడంతో.. చాలామంది ప్రయాణికులు పిల్లలతో సహా.. ట్రైన్ డోర్ ల వద్ద, బత్ రూమ్స్ వద్ద ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయాణం అంతా సురక్షితమైనది కాదు. పైగా చాలా ప్రమాదంతో కూడినది. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో డోర్ దగ్గర ప్రయాణం చేస్తూ ప్రాణాలు పొగోట్టుకున్న ఘటనలు అక్కడ అక్కడ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రైల్వే సిబ్బంది తాజాగా సాధారణ ప్రయాణికులకు అదిరే శుభవార్త చెప్పింది. అయితే రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. ఇంతకి అదేమిటంటే..

General coaches are increased in Trains

తాజాగా సాధారణ ప్రయాణికులకు ఊరటనిస్తూ.. రైల్వే శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రైళ్లలో అదనంగా మరో నాలుగు జనరల్ కోచ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని, ఈ నేపథ్యంలోనే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2500 జనరల్ క్లాస్ కోచ్‌లు తయారు చేయనున్నారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేశారు.

కాగా, ప్రస్తుతం రెండు జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో వాటి సంఖ్య నాలుగుకు రెట్టింపు అవుతుందని సీనియర్‌ రైల్వే అధికారి తెలిపారు. ఇకపోతే జనరల్ కోచ్‌లు లేని రైళ్లకు రెండు సమకూరుతాయని చెప్పారు. ఇలా చూసుకుంటే.. ఒక్కో జనరల్‌ కోచ్‌లో 150 నుంచి 200 మంది ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో ప్రతి రోజూ అదనంగా ఐదు లక్షల మంది ప్రయాణికులు జనరల్‌ కోచ్‌లో ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. మరోవైపు జనరల్‌ కోచ్‌ల పెంపు ప్రణాళికతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యం పెరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దీని కోసం 1377 స్లీపర్ క్లాస్ కోచ్‌లతోపాటు అదనంగా 2500 జనరల్‌ కోచ్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో జనరల్‌ బోగిల్లో ఏటా 18 కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్‌ చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు. మరి, రైల్వే ప్రయాణికుల కోసం అదనంగా జనరల్ కోచులను ఏర్పాటు చేస్తామని రైల్వే శాక ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.