iDreamPost
android-app
ios-app

Devara: దేవర రిలీజ్ తర్వాత NTR ఎమోషనల్.. ఫ్యాన్స్ కి మాటిస్తూ..!

  • Published Sep 27, 2024 | 2:42 PM Updated Updated Sep 27, 2024 | 2:43 PM

Devara Movie Release- NTR Emotional Post: ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా కూడా దేవర జపమే చేస్తున్నారు. ఎన్టీఆర్ తన నటనతో సముద్రాన్ని ఎరుపెక్కించేశాడు అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. ఆరేళ్ల తర్వాత సోలోగా వచ్చి తమ ఆకలి తీర్చాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Devara Movie Release- NTR Emotional Post: ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా కూడా దేవర జపమే చేస్తున్నారు. ఎన్టీఆర్ తన నటనతో సముద్రాన్ని ఎరుపెక్కించేశాడు అంటూ కితాబు ఇచ్చేస్తున్నారు. ఆరేళ్ల తర్వాత సోలోగా వచ్చి తమ ఆకలి తీర్చాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

  • Published Sep 27, 2024 | 2:42 PMUpdated Sep 27, 2024 | 2:43 PM
Devara: దేవర రిలీజ్ తర్వాత NTR ఎమోషనల్.. ఫ్యాన్స్ కి మాటిస్తూ..!

దేవర.. ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా జపిస్తున్న పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే తమని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్ కి అయితే తారక్ ఫ్యాన్స్ గుడి కట్టేసేలా ఉన్నారు. బీజీఎంతో అనిరుధ్ చేసిన మ్యాజిక్ ఆ రేంజ్ లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను ఊరమాస్ గా ఎలివేట్ చేయండంలో బీజీఎం కీలక పాత్ర పోషించింది అంటున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే దేవర షోలు పడటంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆన్ జోష్ తో థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. దాదాపుగా ఆరేళ్ల తర్వాత సింగిల్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను బిగ్ స్క్రీన్ మీద చూసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. తన భావాలను ఒక ఎమోషనల్ పోస్ట్ రూపంలో తన ఫ్యాన్స్ ముందు పెట్టాడు.

అటు తారక్ కూడా దేవర సినిమా రిలీజ్ పై స్పందించాడు. కేవలం రియాక్ట్ అవ్వడమే కాదు.. ఎమోషనల్ కూడా అయ్యాడు. తన అభిమానులకు ఒక ప్రామిస్ కూడా చేశాడు. అసలు తారక్ ఏం చెప్పాడంటే.. తాను ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. అభిమానులు అందరి ఆదరణ చూస్తే సంతోషంగా ఉందంటూ తారక్ వ్యాఖ్యానించాడు. ఎమోషనల్ గా, ఎంతో ఎంగేజింగ్ గా దేవర సినిమాని ఊహించి.. తెరకెక్కించినందుకు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర ప్రపంచానికి అనిరుధ్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాడు. ఈ మూవీకి పిల్లర్స్ లా ఉన్న ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. దేవర కోసం పనిచేసిన ప్రతి టెక్నీషీయన్ కి తారక్ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశాడు. అలాగే తన ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను అంటూ తారక్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మీరు అందరూ కూడా దేవరను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం నన్ను ఎంతో సంతోష పెట్టిందని చెప్పుకొచ్చాడు. తన అభిమానులకు ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ తప్పక ఇస్తానంటూ తారక్ ప్రామిస్ చేశాడు.

దేవర సినిమా రిలీజ్ సందర్భంగా పాన్ ఇండియా లెవల్లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా లవర్స్ అంతా కూడా దేవర ఊచకోతకు పిచ్చెక్కిపోతున్నారు. యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తారక్ తన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు అనే చెప్పాలి. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంటున్నారు. కానీ, ఒక మాస్ హీరోని ఎలా అయితే చూడాలి అని తమ అభిమానులు కోరుకుంటారో.. ఆ రేంజ్ లోనే ఎన్టీఆర్ అప్పియరెన్స్ ఉంది అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దేవర సినిమా మొత్తాన్ని తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు అంటూ కితాబు ఇస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ విషయంలో మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త జాన్వీ పాత్ర నిడివి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ సినిమా రిజల్ట్ గురించి మానేసి.. దేవర ఏ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు అని లెక్కలు వేసుకుంటున్నారు. ఎలాగూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల వరకు టికెట్స్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. కచ్చితంగా రికార్డులు అయితే బద్దలవుతాయి. మొదటి రోజు దేవర ఏ ఏ రికార్డులు బద్దలు కొట్టాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. మరి.. దేవర విషయంలో ఎన్టీఆర్ ఎమోషనల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet