iDreamPost
android-app
ios-app

హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్.. చచ్చిపోతా అంటున్న బాధితుడు

  • Published Sep 27, 2024 | 1:03 PM Updated Updated Sep 27, 2024 | 1:03 PM

Harsha Sai Case Latest Update: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త వ్యక్తులు బయటపడుతున్నారు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

Harsha Sai Case Latest Update: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త వ్యక్తులు బయటపడుతున్నారు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Sep 27, 2024 | 1:03 PMUpdated Sep 27, 2024 | 1:03 PM
హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్.. చచ్చిపోతా అంటున్న బాధితుడు

ఇప్పుడు అందరి ఫోకస్ ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పైనే ఉంది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి.. తన వద్ద నుంచి కోట్ల రూపాయలు కాజేశాడని.. అలాగే తనపై పలు సార్లు అత్యాచార యత్నం కూడా చేసాడని.. తాన్ న్యూ*డ్ ఫొటోస్ తీసి బెదిరించాడని ఓ యువతి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు అనేక కోణాలలో ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు హర్ష సాయి లాయర్ .. ఇటు ఆ బాధిత యువతి లాయర్ ఇద్దరు కూడా ఎవరికీ వారు ఏ తప్పు చేయలేందంటూ.. మీడియా ముందు చెబుతున్నారు. వీరిలో ఎవరి మాటల్లో నిజం ఉందన్న సంగతి.. హర్ష సాయిని విచారిస్తే కానీ తెలియదు. ఈ క్రమంలో హర్ష సాయి ఎపిసోడ్ లో తెరపైకి మరో యూట్యూబర్ ఎంటర్ అయ్యాడు. అతనిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే హర్ష సాయి నన్ను నిండా ముంచేశాడు.. చచ్చిపోతా అంటూ మరో బాధితుడు విలపిస్తున్నాడు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

అసలు హర్ష సాయి వివాదం మొదలైంది ఒక సినిమా విషయంలో అని.. ఇప్పటికే అనేక కథనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వివాదంలో హర్షసాయి.. బాధిత యువతితో పాటు.. ఆ మూవీ కో ప్రొడ్యూసర్ కూడా ఇరుక్కుపోయాడు. చిన్న వయసులో సొంత ఖర్చుతో హర్ష సాయిని.. ఆ యువతిని పెట్టి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశాడు. కానీ ఇంతలోనే ఈ వివాదం తెరపైకి వచ్చింది. హర్ష సాయి ని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నందుకు తన జీవితం కూడా నాశనం అయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆ కో ప్రొడ్యూసర్. తానూ సూసైడ్ చేసుకునే పరిస్థితిల్లో ఉన్నానంటూ ఆ వ్యక్తి హర్ష సాయికి.. మెసేజ్ కూడా పెట్టనంటూ చెప్పుకొచ్చాడు ఆ బాధితుడు. మరి ఇంకా ఈ కేసు విషయంలో ఎంత మంది బయటకు వస్తారో.. ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో పూర్తి వివరాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హర్ష సాయి కూడా తాను ఏ తప్పు చేయలేదని.. నిజ నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని పోస్ట్ చేయడంతో.. అతని కోణంలో కూడా నెటిజన్ల ఆలోచన మళ్లింది. కానీ ఇప్పుడు ఆ బాధిత యువతి తరపు నుంచి.. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సినిమా విషయంలో మొదలైన ఈ వివాదం ఎక్కడివరకు దారి తీస్తుందో తెలియదు. ఈ కేసులో ఎప్పుడు ఏ విషయాలు బయటపడతాయా అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu