iDreamPost
android-app
ios-app

ఇదేం అభిమానం రా బాబు.. దేవర సినిమా చూసేందుకు టోక్యో నుండి లాస్ ఏంజెల్స్‌కు

యంగ్ టైగర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలైంది. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రం నిలిచింది దేవర. కాగా, ఈ సినిమాను ఇక్కడ తిలకించేందుకు దేశాలు కాదు ఖండాలు దాటి వచ్చిందో మహిళా అభిమాని.

యంగ్ టైగర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలైంది. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రం నిలిచింది దేవర. కాగా, ఈ సినిమాను ఇక్కడ తిలకించేందుకు దేశాలు కాదు ఖండాలు దాటి వచ్చిందో మహిళా అభిమాని.

ఇదేం అభిమానం రా బాబు.. దేవర సినిమా చూసేందుకు టోక్యో నుండి లాస్ ఏంజెల్స్‌కు

చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకుని మాస్ ఆఫ్ ది మ్యాన్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఇంతింతై వటుడింతయు అన్నట్టుగా ఎదిగాడు. టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిని దాటి.. గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అభిమానుల్లో జపాన్ ఫ్యాన్సే వేరయ్యా అన్నట్లు ఉంటారు.  తారక్‌కు జపాన్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచాయి. జపాన్ ప్రజల ఫేవరేట్ హీరోగా మారాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతంలో యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జపాన్‏లో సందడి చేయగా.. అతడ్ని కలిసేందుకు భారీగానే లేడీ ఫ్యాన్స్ వచ్చారు. యంగ్ టైగర్‌తో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ తీసుకుని మురిసిపోయారు. ఇదిలా ఉంటే దేవర సినిమా చూసేందుకు ఓ మహిళా అభిమాని పెద్ద సాహసమే చేసి తన అభిమానాన్నిచాటుకుంది.

దేవర ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో సెప్టెంబర్ 27న విడుదలైన సంగతి విదితమే. నార్త్ అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రదర్శితమైంది. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రం నిలిచింది దేవర. ఈ సినిమాను అక్కడ వీక్షించేందుకు వెళ్లాడు యంగ్ టైగర్. అయితే అక్కడే దేవర మూవీని చూసేందుకు జపాన్‌కు చెందిన డై హార్ట్ మహిళా ఫ్యాన్ దేశాలు దాటి, ఖండాలు దాటి వచ్చింది.  ఈ రెండింటి మధ్య దూరం 8 వేల కిలో మీటర్లు పైమాటే.  జపాన్ రాజధాని టోక్యో నుండి లాస్ ఏంజెల్స్ వచ్చి బియాండ్ ఫెస్ట్‌లో సినిమా వీక్షించింది. ఈ సమయంలో తారక్ ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అతడ్ని చూడగానే భావోద్వేగానికి గురైన ఆ మహిళా అభిమాని ‘మీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం.. జపాన్ రావాలి అంటూ’ జూనియర్ ఎన్టీఆర్‌ను కోరగా.. తాను వస్తానంటూ హామీనిచ్చారు.

కచ్చితంగా జపాన్ వస్తానంటూ ఆమెకు ప్రామిస్ చేశారు. దీంతో ఉబ్బితబ్బిబ్బు అయిన మహిళా అభిమాని ఆనంద భాష్పాలతో ధాంక్యూ చెప్పింది. అనంతరం ఆమెతో సెల్ఫీ కూడా దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తారక్- జపాన్ మహిళ మధ్య జరిగిన చిన్నచిట్ చాట్.. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ క్రేజ్, క్రష్ తెలుస్తుంది. దేశాలు కాదు.. ఖండాంతరాలు దాటి సినిమా వాచ్ చేస్తుండటంతో.. అభిమానం అంటే ఇలా ఉంటుందా అనిపించకమానదు. తమ అభిమాన నటుడ్ని చూసే సరికి అభిమానులు ఆనందంలో మునిగి తేలారు ఫ్యాన్స్. ఇక మొత్తానికి థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేశాడు దేవర. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్. ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా పాజిటివ్ టాక్, బజ్ నడుస్తుంది. తారక్ డ్యూయల్ రోల్, కొరటాల శివ వర్కింగ్ స్టైల్, గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్, అనిరుధ్ సంగీతంతో పిచ్చెక్కించాడని పొగిడేస్తున్నారు అభిమానులు.