iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్.. అక్కడ దేవర నిడివి తగ్గింపు

  • Published Sep 27, 2024 | 1:04 PM Updated Updated Sep 27, 2024 | 1:04 PM

Jr NTR Devara Movie: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దేవర  జాతరే కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ రన్ టైమ్ ను తగ్గించారట. ఆ వివరాలేంటో చూద్దాం.

Jr NTR Devara Movie: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దేవర  జాతరే కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ రన్ టైమ్ ను తగ్గించారట. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 27, 2024 | 1:04 PMUpdated Sep 27, 2024 | 1:04 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్.. అక్కడ దేవర నిడివి తగ్గింపు

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా థియేటర్ల వద్ద ‘దేవర’ ఫీవర్ జోరుగా కొనసాగుతుంది. దాదాపు ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా దేవర మూవీతో నేడు (సెప్టెంబర్ 27వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో వద్ద ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు లేవు. ముఖ్యంగా అర్థ‌రాత్రి 1 గంటకే ప్రత్యేక షో స్టార్ట్ అయిపోవడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ పండగ వాతావరణం నెలకొంది. పైగా ఎక్కడ చూసిన దేవర మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ పరంగా దేవర ఊచకోత మొదలైంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ ఆ ప్రాంతంలో రన్ టైమ్ ను తగ్గించారట. ఆ వివరాలేంటో చూద్దాం.

 ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దేవర  జాతరే కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో దేవర మూవీ రన్ టైమ్ ను తగ్గించారట. అదేంటి దేవర నిడివి తగ్గించారా అని ఆశ్చర్యపోతున్నారా.. కంగారు పడకండి ఇది తెలుగులో కాదు. హిందీ వెర్షన్ తగ్గించారట. ముఖ్యంగా తెలుగు వెర్షన్ తో పోల్చితే ఏడు నిమిషాల తక్కువ నిడివితో దేవర సినిమా హిందీలో విడుదల అయిందని తెలుస్తోంది. ఎందుకంటే.. తెలుగు నటీ నటుల సోలో షాట్స్ తొలగించడంతో పాటు, ఒకటి రెండు సన్నివేశాలను ట్రిమ్‌ చేయడం వల్ల హిందీ వెర్షన్‌ నిడివి 7 నిమిషాలు తగ్గినట్లు సమాచారం అందుతోంది.

ఇకపోతే తెలుగులో దేవర సినిమాను 2 గంటల 50 నిమిషాల రన్‌ టైమ్‌ తో విడుదల చేయగా, హిందీలో మాత్రం 2 గంటల 43 నిమిషాల రన్‌ టైమ్‌ తో విడుదల చేయడం జరిగిందట.  పైగా హిందీ ప్రేక్షకులకు రన్ టైం తక్కువ ఉండటం మంచిదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దేవర సినిమాలో సైప్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించడం వల్ల ఈ సినిమాకు పెద్ద ఎత్తునే హిందీ ప్రేక్షకులు నుంచి స్పందన ఉంటుదని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర సినిమా హిందీలో కచ్చితంగా వంద కోట్లకు మించి వసూళ్లు సాధిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.  ముఖ్యంగా  వీకెండ్‌ కలిసి రావడంతో దేవర మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దేవర మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ , శృతి మారతే , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , నరైన్ , అజయ్ తదితర నటీ, నటులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా, కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. మరి, దేవర మూవీ హిందీలో వెర్షన్ లో రన్ టైమ్ ను తగ్గించడం  పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.