iDreamPost

నవదీప్‌ను 6 గంటల పాటు విచారించిన నార్కోటిక్స్‌ అధికారులు!

నవదీప్‌ను 6 గంటల పాటు విచారించిన నార్కోటిక్స్‌ అధికారులు!

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ అధికారులు హీరో నవదీప్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్‌ శనివారం విచారణకు హాజరయ్యారు. నార్యోటిక్స్‌ అధికారులు ఆయన్ని దాదాపు 6 గంటల పాటు విచారించారు. డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ పాత్ర.. ఇదే కేసులో అరెస్టయిన రామచందర్‌ అనే వ్యక్తితో నవదీప్‌ సంబంధాలు.. ఇతర విషయాల గురించి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసులు వచ్చినందు వల్లే విచారణకు వచ్చానని అన్నారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన రామచందర్‌ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉన్న వాస్తవమేనని,

అది కూడా పదేళ్ల క్రితం విషయమని తెలిపారు. తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని చెప్పారు. గతంలో తాను ఓ పబ్‌ను నిర్వహించినందు వల్ల విచారణకు పిలిచారని అన్నారు. నాడు సిట్‌, ఈడీలు విచారిస్తే.. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్‌ విచారిస్తోందని తెలిపారు. నార్కోటిక్స్‌ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానన్నారు. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పానన్నారు. ఏడు సంవత్సరాల క్రితం పాత ఫోన్‌ రికార్డులను సైతం అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.

సీపీ సీవీ ఆనంద్‌, సునీత రెడ్డిల నేతృత్వంలోని టీమ్‌ డ్రగ్స్‌ కేసులో చాలా చక్కగా పనిచేస్తోందని ప్రశంసించారు. కాగా, సెప్టెంబర్‌ 14న తెలంగాణ నార్కోటిక్స్‌ అధికారులు, గుడిమల్కాపూర్‌ పోలీసులు కలిసి డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్‌ చేశారు. వారినుంచి డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిలో ఒకరైన రామచందర్‌తో నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు, డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరి, డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను విచారించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి