iDreamPost

రూ.2000 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సినీ నిర్మాత కీలక సూత్రదారి!

  • Published Feb 25, 2024 | 11:51 AMUpdated Feb 25, 2024 | 11:54 AM

Drugs racket at Delhi: డబ్బు సంపాదించడానికి కొంతమంది బడా బాబులు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

Drugs racket at Delhi: డబ్బు సంపాదించడానికి కొంతమంది బడా బాబులు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.

  • Published Feb 25, 2024 | 11:51 AMUpdated Feb 25, 2024 | 11:54 AM
రూ.2000 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. సినీ నిర్మాత కీలక సూత్రదారి!

ఈ మధ్య యువత ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది బడాబాబులు యువతను టార్గెట్ చేసుకొని మత్తు పదార్థాల దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉంది. దారుణమైన విషయం ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ దందాల్లో కొంతమంది సెలబ్రెటీల జోక్యం కూడా ఉంటుందని పోలీసులు ఇటీవల పలు సందర్భాల్లో రుజువు చేశారు. తాజాగా కోట్లు విలువ చేసే డ్రగ్స్ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు.. ఇందులో ప్రముఖ నిర్మాత హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీల సంయుక్త ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. డ్రగ్స్ నెట్ వర్క్ లో తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత కీలక సూత్రదారిగా పోలీసులు గుర్తించారు. ఆ నిర్మాత తీసిన మూవీ మార్చిలో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని, అతనికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ నెట్ వర్కా్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాతో పాటు భారత్ లో కూడా పలు చోట్ల విస్తరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 50 కిలోల సుడో ప్రేడ్రిన్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్ ని ఎండు కొబ్బరి, హెల్త్ మిక్స్ పౌడర్ లాంటి ఆహార పదార్ధాల ముసుగులో అక్రమంగా రవాణా చూస్తున్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. సుడో పెడ్రిన్ ని మేథాంఫెటమిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

ఈ డ్రగ్స్ ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కిలో రూ.1.5 లెక్కన విక్రయిస్తారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ సరుకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో స్కెచ్ వేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 15 న పశ్చిమ ఢిల్లీ బసాయి దాపూర్ లోని ఒక గోదాంపై లో తనిఖీ చేస్తుండగా 50 కిలోల డ్రగ్స్ పట్టుపడిందని పోసులు తెలిపారు. ఈ సందర్బంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసున్నామని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పట్టుకున్న డ్రగ్స్ ముఠా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిపారు. మూడేళ్ల నుంచి ఈ ముఠా సభ్యులు మొత్తం 45 సరుకులు సరఫారా చేయగా అందులో దాదాపు 3,500 కిలోల సూడో ఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ధర సుమారు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ నెట్ వర్క్ ని మూలాలను కనుగొనేందుకు ఆయా దేశాల్లో ఉన్న నిందితుల అరెస్ట్ చేయడానికి ఎన్‌సీబీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అధికారులను సంప్రదించినట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి