iDreamPost

OTT Movie:OTTలో గొప్ప సినిమా! కార్పొరేట్ కాలేజీలతో.. ఓ ఉపాధ్యాయుడి పోరాటం!

  • Published Apr 20, 2024 | 6:47 PMUpdated Apr 26, 2024 | 6:20 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. అయితే దాదాపు అన్నిటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా కొన్ని సినిమాలు చూసేయొచ్చు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఏంటో సబ్స్క్రిప్షన్ లేకుండా ఎక్కడ చూడాలో చూసేద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. అయితే దాదాపు అన్నిటికీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా కొన్ని సినిమాలు చూసేయొచ్చు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఏంటో సబ్స్క్రిప్షన్ లేకుండా ఎక్కడ చూడాలో చూసేద్దాం.

  • Published Apr 20, 2024 | 6:47 PMUpdated Apr 26, 2024 | 6:20 PM
OTT Movie:OTTలో గొప్ప సినిమా! కార్పొరేట్ కాలేజీలతో.. ఓ ఉపాధ్యాయుడి పోరాటం!

ఓటీటీ లో ఈ వారం ఇన్ని సినిమాలు వచ్చాయి.. ఈ సినిమా బావుంది.. ఈ సినిమా బాలేదు ఇలా సోషల్ మీడియాలో రకరకాల సజ్జెషన్స్. కానీ దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు సబ్స్క్రిప్షన్స్ కావాలి. కానీ అందరు ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే ఛాన్స్ లేకపోవచ్చు. అయితే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ లేకపోయినా కూడా మంచి మంచి మూవీస్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండేలా అమెజాన్ మినీ టీవీలో ఫ్రీ గా ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు సినిమాలు ఉండవులే అని లైట్ తీసుకుంటే మాత్రం.. మంచి సినిమాలు మిస్ అయినట్లే.. ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజ్ వేరు అయినా కానీ.. తెలుగులో కూడా ఆయా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ లో స్ట్రీమింగ్ అయ్యే ఒక వర్త్ వాచ్ సిరీస్ గురించి తెలుసుకుందాం.

అమెజాన్ మినీ టీవీ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ సిరీస్ పేరు “ఫిజిక్స్ వాలా”. ఈ సిరీస్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 8.3 రేటింగ్ దక్కించుకుంది. ఈ సిరీస్ పేరును చూసి చాలా మంది గెస్ చేసి ఉంటారు ఫీజిక్స్ వాలా అంటే స్టడీస్ కు సంబంధించిందో లేదా ఏదైనా రీసెర్చ్ కు సంబంధించిందో అని అనుకుంటూ ఉండి ఉంటారు. కానీ అవేమి కాదు ఈ సిరీస్ ఒక వ్యక్తి జీవితానికి సంబంధించింది. ఉదాహరహణకు ఇప్పుడు బయట విద్యాసంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్థులు.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఇప్పటివరకు మనం ఎన్నో చూశాము. దీని గురించి ఎవరో ఒకరు ప్రశ్నించి పోరాడి .. విద్యావిధానంలో మార్పు తీసుకురావాలని.. ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి కథే ఇది.

సమాజంలో ఉన్న ఎన్నో కార్పొరేట్ సంస్థలతో పోరాడుతూ.. అందరికి సమానమైన విద్యను అందించాలని .. ఒక ఉపాద్యాయుడు చేసే.. పోరాటంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కున్నాడు ! చివరికి ఎలా మార్చగలిగాడు ! అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆ ఉపాధ్యాయుడి యొక్క ఇన్స్పిరేషనల్ జర్నీ ఏ ఈ సిరీస్ స్టోరీ.. ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ లోను ఎక్కడా బోర్ కొట్టించకుండా.. ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ , యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసి ఉండకపోతే ఒక వర్త్ వాచింగ్ సినిమాను మిస్ అయినట్లే. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే ఈ సినిమా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి